Asianet News TeluguAsianet News Telugu

రాజ్ తరణ్ భలే తేడాగా ఉన్నాడే

ఇంతకీ హీరోకి ఉన్న సమస్య ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటూ టీజర్ ను బాగా కట్ చేశారు.

Raj Tarun Bhale Unnade Teaser released jsp
Author
First Published May 6, 2024, 12:16 PM IST


రాజ్ తరుణ్ కు ప్రారంభంలో వసరపెట్టి హిట్లు వచ్చాయి. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ మరియు కుమారి 21F, ఈడో రకం-వాడో రకం లాంటి విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే వరుస ఫ్లాఫ్స్ తో ఆల్ మోస్ట్ 8 ఏళ్ళుగా హిట్ కి దూరంగా ఉన్నాడు…మధ్యలో చాలా సినిమాలు చేసినా కూడా ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అయితే అందుకోలేక పోయాయి…కానీ .. కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవల 'నా సామి రంగా' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 'భలే ఉన్నాడే' అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి జె శివ సాయి వర్ధన్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ మారుతి తన టీమ్ తో కలిసి సమర్పిస్తున్నారు.

రాజ్ తరుణ్ నుండి వస్తున్న కొత్త సినిమా భలే ఉన్నాడే(Bhale Unnaade Movie) టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.టీజర్ చూస్తుంటే మునుపటి రాజ్ తరుణ్ హిట్స్ ని మరిపించే రేంజ్ లో ఈ టీజర్ ఆకట్టుకుంది అని చెప్పాలి…పెళ్లి టైంలో పెళ్లి కూతురుని రెడీ చేసే పని చేసే హీరో కొంచెం అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. ఈ క్రమంలో అందరూ తనని మరో విధంగా అనుకుంటారు. తనని చూసి ఇష్టపడే హీరోయిన్ కి కూడా హీరో దూరంగా ఉంటాడు. మరి ఇంతకీ హీరోకి ఉన్న సమస్య ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటూ టీజర్ ను బాగా కట్ చేశారు.మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ రిచ్ విజువల్స్ తో టీసర్ మంచి క్వాలిటీతో ఉన్న టీజర్ అందరనీ ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ మనీషా కందుకూరు కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అనేక మంది కమెడియన్లు నటిస్తున్నట్లు అర్దమవుతోంది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.  ఈ మూవీలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'చెప్పవే చిరుగాలి' ఫేమ్ అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ వంటి పలువురు నటీమణులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హైపర్ ఆది, గోపరాజు రమణ, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా యాక్ట్ చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios