అమ్మ.. ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, ఆదర్శం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందని రూపం అమ్మ. మనం కడుపులో పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సమస్యలెదుర్కొంటూ.. తాను పునర్జన్మనెత్తుతూ మనకు జన్మనిస్తుంది. అలాంటి అమ్మ కోసం ఏం చేసిన తక్కువే. అమ్మపై ప్రేమ చూపించడానికి ఇలా కూడా టాటూలు వేయించుకోవచ్చు. ట్రెండీ టాటూల కోసం ఓ లూక్కేయండి.