పెళ్లికి ఇలాంటి గిఫ్ట్ లను మాత్రం ఇవ్వకండి
కొంతమంది పెళ్లి గిఫ్ట్ గా డబ్బులు పెడితే.. మరికొంతమంది దుస్తులను లేదా బంగారం, వెండి వంటివి పెడుతుంటారు. మరికొంతమంది నచ్చిన వాటిని పెట్టేస్తుంటారు. కానీ కొన్ని రకాల వస్తువులను పెళ్లి గిఫ్ట్ గా మాత్రం ఇవ్వకూడదు. అవేంటో తెలుసా?

పెళ్లి గిఫ్ట్ గా ఏం ఇవ్వకూడదు?
ప్రతి పెళ్లికి ఏదో ఒక కానుక పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది డబ్బులు పెడితే.. మరికొంతమంది వెండి, బంగారు ఆభరణాలను పెడుతుంటారు. బంధువులే ఇలాంటి గిఫ్ట్ లను పెట్టేస్తుంటారు. కానీ ఫ్రెండ్స్, కొలిగ్స్ ఎక్కువగా గోడ గడియారం లేదా చేతి వాచ్ లేదా ఫ్రేమ్ లను గిఫ్ట్ గా ఇస్తుంటారు. కానీ కొత్త జంటలకు కొన్ని రకాల వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వొద్దు తెలుసా? ఎందుకంటే కొన్ని రకాల వస్తువులు భయంకరమైన అర్థాన్ని చూపుతాయి. ఇవి కొత్త జంటను భయపెట్టేవిగా ఉంటాయి. అందుకే పెళ్లి కానుకగా ఇలాంటి వాటిని ఇవ్వకూడదు.
పెళ్లి గిఫ్ట్ గా ఏం ఇవ్వకూడదు?
ఇంటిమేట్ ఐటమ్స్
చాలా మంది సన్నిహితమైన, వ్యక్తిగత వస్తువులను బహుమతిగా ఇస్తుంటారు. కానీ లోదుస్తులు, పర్సనల్ కేర్, ఇన్నర్ వేర్ వంటి వస్తువులను ఎప్పుడూ కూడా పెళ్లి కానుకగా ఇవ్వకూడదు. అసలు ఇవి పెళ్లి కానుకకు పనికి రావు. అందుకే ఇలాంటి వాటిని పెళ్లి గిఫ్ట్ గా మాత్రం ఇవ్వకండి.
అత్యంత ఖరీదైన బహుమతులు
బంధువులు ఎక్కువగా పెళ్లి కానుకగా దంపతులకు వెండి, బంగారం, వెండి, డైమండ్, ప్లాటినం వంటి ఎంతో ఖరీదైన బహుమతులను ఇస్తుంటారు. ఇలాంటి ఖరీదైన బహుమతులను బంధువులు పెడితే ఏం కాదు కానీ.. మీరు పరిచయం ఉన్నవారు లేదా సహోద్యోగి అయితేనే దంపతులకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి గిఫ్ట్ ను మాత్రం పెట్టకండి.
ఇంటిమేట్ ఐటమ్స్
చాలా మంది సన్నిహితమైన, వ్యక్తిగత వస్తువులను బహుమతిగా ఇస్తుంటారు. కానీ లోదుస్తులు, పర్సనల్ కేర్, ఇన్నర్ వేర్ వంటి వస్తువులను ఎప్పుడూ కూడా పెళ్లి కానుకగా ఇవ్వకూడదు. అసలు ఇవి పెళ్లి కానుకకు పనికి రావు. అందుకే ఇలాంటి వాటిని పెళ్లి గిఫ్ట్ గా మాత్రం ఇవ్వకండి.
అనవసరమైన వస్తువులు
నిజం చెప్పాలంటే కొత్త జంటలకు వారి లైఫ్ స్టైల్ ను ఎలా మెయింటైన్ చేయాలనేదానిపై సరిగ్గా అవగాహన ఉండదు. అంటే వీరికి పెళ్లి తర్వాతి లైఫ్ గురించి ప్రతీదీ తెలియకపోవచ్చు. కాబట్టి ఎప్పటికో ఉపయోగపడే వస్తువులను పెళ్లి కానుకగా పెట్టకండి. అంటే ప్రసెంట్ వారికి పనికి వచ్చే వస్తువులనే వారికి పెళ్లి గిఫ్ట్ గా పెట్టండి. ఇవి వారికి కొంత భారాన్ని తగ్గిస్తాయి.
ప్రతికూల అర్థాలొచ్చే బహుమతులు
మనకు తెలియకపోవచ్చు కానీ.. చాలా గిఫ్ట్ లు ప్రతికూల అర్థాలను కలిగి ఉంటాయి. అంటే కత్తులు వంటి పదునైన వస్తువులు విడిపోయే బంధాలు వంటి అర్థాలను సూచిస్తాయి. ఇకపోతే చాలా మంది గడియారాన్ని కూడా గిఫ్ట్ గా పెడుతుంటారు. కానీ ఇలాంటి వీడ్కోలు లేదా మరణాన్ని సూచిస్తాయి. ఇకపోతే చేతి రుమాలు అంత్యక్రియలను సూచిస్తుంది. అందుకే మీరు పెట్టే గిఫ్ట్ ఇలాంటివి కాకుండా చూసుకోండి.
రీగిఫ్టెడ్ ఐటమ్స్
నిజానికి ఇది చెత్త ఐడియా అనే చెప్పాలి. కొంతమంది వేరేవారు ఇచ్చిన దాన్నే మళ్లీ వారికే గిఫ్ట్ గా ఇస్తుంటారు. నిజానికి మనకు బహుమతిగా ఇచ్చిన వస్తువును తిరిగి వారికే బహుమతిగా పెట్టడం బాగుండదు. ఇలాంటివి ఇస్తే ప్రతి ఒక్కరికీ ఇది పాత వస్తువు అని అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని గిఫ్ట్ గా ఇవ్వకపోవడమే మంచిది.