Cheating : మీ భర్త ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే
Cheating Husband Signs: నేటి సమాజంలో సంబంధాలు బలహీనంగా మారిపోయాయి. ఒకరినొకరు మోసం చేసుకుంటూ రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. మరి భర్తలు తమ భార్యలను మోసం చేస్తున్నట్టైతే దానిని భార్యలు ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

చీటింగ్
ప్రేమ అయినా, పెళ్లి అయినా, ఫ్రెండ్ షిప్ అంటూ ఏ బంధానికైనా నమ్మకమే పునాది. నమ్మకం పోతే ఏ బంధమైనా బీటలు వారుతుంది. ఆ బంధానికి అర్థం లేకుండా పోతుంది. నిజం చెప్పాలంటే నమ్మకంలేని బంధం ఎక్కువ రోజులు నిలవదు.
చీటింగ్
ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు కామన్ అయిపోయాయి. నమ్మకద్రోహం చేయడం, మోసం చేయడం కామన్ విషయమైపోయింది. కానీ దీనివల్ల రిలేషన్ షిప్ లో ఒకరు నష్టపోతున్నారు. అయితే ఈ ఆర్టికల్ లో మనం భర్త చీటింగ్ చేస్తే దానిని ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రహస్యం
మీ భాగస్వామి మిమ్మల్ని చీటింగ్ చేస్తే అతను మీకు ఎన్నో విషయాలను రహస్యంగా ఉంచుతాడు. అలాగే మీతో ఓపెన్ గా మాట్లాడడు. అలాగే చాటు చాటుగా ఫోన్ ను వాడుతాడు. అలాగే ఫోన్ ను ఎప్పుడూ సైలెంట్ లోనే పెడతాడు. అలాగే పాస్ వర్డ్ ను మార్చడం, మీకు పాస్ వర్డ్ ను చెప్పడదు. రాత్రిపూట ఫోన్ ను ఎక్కువగా చూడటం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటే గనుక అతను మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే లెక్క.
మీకు తెలియకుండా, చాటు చాటుగా ఫోన్ ను వాడుతుంటే వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. అయితే ప్రతి ఒక్కరూ ప్రైవసీ ఉండాలనుకుంటారు. కానీ ఇది మితిమీరితే మాత్రం కామన్ విషయం కాదు. మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పు ఆకస్మికంగా వస్తే మాత్రం అతను మీతో ఏదో దాస్తున్నాడని అర్థం.
ఆలస్యంగా రావడం
చీటింగ్ చేసేవారు ఇంటికి తొందరగా రారు. ఎప్పుడూ ఏదో ఒక కారణం చెప్తారు. అలాగే మీ ఫోన్ కాల్ కు ఆన్సర్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఎటైనా వెళ్తామని చెప్పి తర్వాత వద్దు అనడం అనుమానించాల్సిన విషయాలే. అలాగే ఆఫీస్ మీటింగ్స్, ఎక్కువ గంటలు పని అంటూ తరచూ చెప్పడంలో నిజం లేకపోవచ్చు. ఇలా తరచుగా జరిగితే మాత్రం మీ భర్తను అనుమానించాల్సిందే.
నకిలీ ప్రేమ
చాలా మంది ఏదైనా తప్పు చేసినప్పుడే లేని ప్రేమను కురుపిస్తుంటారు. ఎప్పుడూ లేనిది మీపై ప్రేమ చూపించడం, మిమ్మల్ని పొగడటం, గిఫ్ట్ ఇవ్వడం, ప్రేమ మాటలు మాట్లాడటం వంటివి చేస్తే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది ప్రేమతో కాకుండా అపరాధ భావనతో చేయొచ్చు. ఇలాంటివి నమ్మకపోవడమే మంచిది.
మీతో ఉండకపోవడం
మీ భాగస్వామి మీతో ఏకాంతంగా గడపడానికి ఇష్టపడకపోయినా, తప్పించుకున్నా అనుమానించాల్సిందే. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టైతే మిమ్మల్ని తాకడానికి, మీతో మాట్లాడటానికి, ప్రేమగా మసలడానికి అస్సలు ఇష్టపడరు.మోసం చేసేవారు మీకు దూరంగా ఉంటారు.