ఈ ఐదు రూల్స్ ఫాలో అయితే.. భార్యభర్తల మధ్య చిన్న తేడా కూడా రాదు..!
భార్యాభర్తలు ఒకరి కుటుంబ సభ్యులను ఒకరు గౌరవించుకోవాలి, ఎందుకంటే చాలా సార్లు భార్యాభర్తలు ఒకరి కుటుంబ సభ్యుల కంటే మరొకరు తమ సొంత కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

Couple Relation
భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న తేడాలు రావడం, చిన్నపాటి గొడవలు జరగడం చాలా సహజం. ఇది అందరి ఇళ్ల ల్లోనూ జరిగేదే.కానీ, కొన్నిసార్లు చిన్నపాటి వాదనలే పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. దాని వల్ల ఇద్దరి మధ్య విభేదాలు రావడం, ఆఖరికి విడాకులకు దారితీస్తూ ఉంటుంది.అలా కాకుండా ఉండాలంటే.. కచ్చితంగా భార్యాభర్తలు కచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. మరి, అవేంటో తెలుసుకుందామా....
1.ఒకరిపై మరొకరికి నమ్మకం...
ఒక బంధం నిలపడాలి అంటే.. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది తమ భాగస్వామిని అనుమానిస్తూ ఉంటారు. ఈ అనుమానం.. చివరికి, దంపతుల మధ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది. దంపతుల మధ్య దూరం కూడా పెరుగుతుంది. అందుకే.. అపనమ్మకాన్ని పక్కన పెట్టేయండి. మీకు ఏవైనా కాస్త అనుమానంగా అనిపిస్తే.. శాంతియుతంగా వారినే అడిగి చూడండి. లేదంటే.. వారికి తెలియకుండా సీక్రెట్ గా తెలుసుకునే పని చేయండి. అంతేకానీ,అనుమానంతో మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టే పని చేయకూడదు.
2.కుటుంబ సభ్యులను గౌరవించండి...
భార్యాభర్తలు ఒకరి కుటుంబ సభ్యులను ఒకరు గౌరవించుకోవాలి, ఎందుకంటే చాలా సార్లు భార్యాభర్తలు ఒకరి కుటుంబ సభ్యుల కంటే మరొకరు తమ సొంత కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. దీని వల్లనే వారి మధ్య విభేదాలు రావచ్చు. కాబట్టి, ఒకరి కుటుంబానికి.. మరొక కుటుంబానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.
3.మీ భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించండి...
మీ భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించడం మంచిది. మీరు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు, మీరు నిజాయితీగా ఏదైనా చెప్పాలని గుర్తుంచుకోండి. అంటే, మీరు మీ భాగస్వామితో మాట్లాడిన ప్రతిసారీ వారికి అబద్ధం చెప్పకండి. ఎందుకంటే నిజం బయటపడినప్పుడు, మీ భాగస్వామి మనసు గాయపడవచ్చు. మీ సంబంధం విచ్ఛిన్నం కావచ్చు.
4.భార్యాభర్తలు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..
భార్యాభర్తల సంబంధంలో చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం. దీనిని నివారించడానికి, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకు మీ భాగస్వామితో ఏదైనా అంశం గురించి బహిరంగంగా మాట్లాడటం, ప్రతిరోజూ అతనికి/ఆమెకు సమయం ఇవ్వడం. మీరు రోజంతా ఎంత బిజీగా ఉన్నా, మీ భాగస్వామితో కూర్చుని వారితో మాట్లాడటానికి కొంత సమయం కేటాయించండి. మీరు ప్రతిరోజూ అతనితో/ఆమెతో మాట్లాడితే, మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. తగాదాలను నివారించగలరు.
5.వినడం నేర్చుకోవాలి...
ప్రతి సారీ మీ భాగస్వామికి అలా చేయమని, ఇలా చేయమని చెప్పడం మాత్రమే కాదు..వారు చెప్పేది కూడా వినాలి. వారి సంతోషాలు, బాధలు ప్రతిదీ వారు ఏది చెప్పాలి అనుకున్నా వినడానికి మీరు కాస్త సమయం కేటాయించాలి. దీని వల్ల వారికి మీకు వారి మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది.
ప్రతిసారీ మీ భాగస్వామికి సలహా ఇచ్చే బదులు, వారితో ఉండి వారి మాట వినండి. జాగ్రత్తగా వినండి. ప్రశాంతంగా ఉండండి, వారు ఏదైనా తప్పు చెప్పినా అరవకండి. అవసరం అయితే సలహా ఇవ్వండి.