Asianet News TeluguAsianet News Telugu

కరోనా కు మందు వచ్చేస్తుందన్న ట్రంప్: వాస్తవాలు ఇవీ...!

ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాక్సిన్ తయారీకి కనీసం ఇంకొక్క సంవత్సర కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం కొంతలో కొంత ఈ వైరస్ మహమ్మారి నుండి మనుషుల ప్రాణాలను కాపాడేలా మందును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ. 

US President Donald Trump doubles down on Anti malarial Drugs: How far can that help?
Author
New York, First Published Mar 22, 2020, 1:19 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. మందులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.... హెచ్ఐవి మందులను ఇతరాత్రాలను కలిపి ఇస్తున్నారు. అంతే తప్ప.. ఈ వైరస్ కి అయితే ఇప్పటికింకా మందు రాలేదు. 

మనిషి రోగనిరోధక శక్తిని పెంచి ఈ వైరస్ పై పోరాటం చేయాలి కాబట్టి, హెచ్ ఐ వి కూడా ఇలానే మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి, అలా హెచ్ఐవి మందులను ఇస్తోంది ప్రభుత్వం. 

ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాక్సిన్ తయారీకి కనీసం ఇంకొక్క సంవత్సర కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం కొంతలో కొంత ఈ వైరస్ మహమ్మారి నుండి మనుషుల ప్రాణాలను కాపాడేలా మందును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ. 

తాజాగా నిన్న సాయంత్రం 7.30 ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మహమ్మారికి దాదాపుగా ఒక మందు దొరికినట్టే అనే భావనలో ఒక ట్వీట్ చేసారు. హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ తో పాటుగా అజిత్రోమైసిన్ మందుల కాంబినేషన్ కరోనా మహమ్మారిపై అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. 

ఆయన ఈ ట్వీట్ చేసేకన్నా ముందు ఫ్రాన్స్ లో జరిగిన ఒక పరిశోధన కూడా ఇదే విషయాన్నీ వెలువరించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ మందులేమిటి? అవి ఎలా పని చేస్తాయనేది తెలుసుకుందాము. 

హైడ్రాక్సిల్ క్లోరోక్విన్... 

మలేరియాను నయం చేసేందుకు ఈ టాబ్లెట్ ను మనము వాడుతాము. మలేరియాను నయం చేయడానికే కాకుండా ఆర్తరైటిస్ నుండి కూడా ఉపశమనం కల్పించేందుకు ఈ టాబ్లెట్ ను వాడతారు. ఇప్పటికి... ఈ టాబ్లెట్ ఆర్తరైటిస్ ని ఎలా  నయం చేస్తుందో తెలియదు. 

కానీ ఇప్పటివరకు జరిగిన పరిశోధనల నుండి సేకరించిన సమాచారం మేరకు, మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా ఈ టాబ్లెట్ ఆర్తరైటిస్ ని నయం చేస్తుందని తెలియవస్తుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ లో ఉన్న ఈ గుణమే ఇక్కడ పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. 

మలేరియా వైరస్ వల్ల కలగకపోయినా... కరోనా కు దెగ్గర చుట్టమైన సార్స్ ను ఎదుర్కోవడంలో ఈ క్లోరోక్విన్ విజయవంతమైందని కొన్ని రీసెర్చులు ప్రకటించాయి. ఇప్పటికి పూర్తిగా అందరి ఆమోద ముద్ర మాత్రం పడలేదు. 

అజిత్రోమైసిన్.... 

ఈ  క్లోరోక్విన్ తోపాటుగా అజిత్రోమైసిన్ ని కలిపి తీసుకున్నప్పుడు కరోనా ను సమర్థవంతంగా ఎదురుకోవొచ్చునని ఇటు ఫ్రెంచ్ పరిశోధనయినా, ట్రంప్ అయినా చెప్పడం జరిగింది. 

మామూలుగా అజిత్రోమైసిన్ ఒక ఆంటిబయోటిక్. దీనిని రకరకాల ట్రీటుమెంటుల్లో వాడినప్పటికీ... బ్రాంకైటీస్, న్యుమోనియా కేసుల్లోనూ ఈ మందును మనం వాడతాము. ఈ మందును ఇప్పుడు అదే న్యుమోనియా లక్షణాలు కలిగిన కరోనా ను ఎదుర్కొనేందుకు వాడుతున్నారు. 

మొత్తానికి ఇంకా పూర్తిస్థాయిలో ఇవే మందులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించకపోయినా... మహమ్మారి ఇలా విజృంబిస్తున్నవేళ కనీసం ప్రాణాలు కాపాడడానికైనా ఈ మందులను వాడాలని సదరు దేశాలు ఆలోచనలు చేస్తున్నాయి. 

అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కి ఈ మందులను పరీక్షించమని పంపారు. వారు ఇంకా వీటిపై పరిశోధనలు జరుపుతున్నారు. మరికొన్ని రోజుల్లో అంటే ఒక నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలియవస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios