పసుపు రైతు కూలుస్తున్నపచ్చటి చెట్లు!
దేశంలోనే అత్యధికంగా పసుపునుపండించే తెలంగాణ రైతు స్వయంగా పచ్చనిచెట్లను కొట్టేసే అనివార్య స్థితిలో ఉన్నాడన్నది ఒక విషాద వాస్తవం.
దేశంలోనే అత్యధికంగా పసుపునుపండించే తెలంగాణ రైతు స్వయంగా పచ్చనిచెట్లను కొట్టేసే అనివార్య స్థితిలో ఉన్నాడన్నది ఒక విషాద వాస్తవం.ముఖ్యమంత్రి కేసీఆర్అటవీ సంపద తరుగుదల నివారణ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్న తరుణంలోఈసమస్యవారిదృష్టికి తేవడం తక్షణ ఉపయోగం అనే ఈ వ్యాసం.
- కందుకూరి రమేష్ బాబు
రైతు గురించి మనకు సహజంగానే సదభిప్రాయం ఉంది.సమాజానికి అన్నం పెట్టెతన గురించి వ్యతిరేకంగా పన్నెత్తి మాట్లాడటానికి మనసొప్పదు. కానీ రాజు గురించి, ప్రజాస్వామ్యంలో రాజ్యంబాధ్యతా రాహిత్యం గురించి ఎంతసేపైనామాట్లాడుతాం.విరుచుకు పడుతాం.మంచిదే.
ఐతే, ఇటీవల తెలంగాణాలోని కొన్ని జిల్లాలను పర్యటిస్తున్నప్పుడుముఖ్యంగారైతు వల్లజరుగుతున్ననష్టాలు దృష్టికి వచ్చాయి. ముఖ్యంగాపసుపు రైతు వల్ల అటవీ సంపదకు జరుగుతున్న నష్టం ఒకటుందని చెప్పక తప్పదు.
రైతు-రాజు
విషాదం ఏమిటంటే,స్థూలంగాఅటవీ భూముల తరుగుదల విషయంలో రైతు అత్యాశఒకతిరోగమనపాత్ర పోషిస్తున్నదని అంగీకరించాలి.అతడు సన్నకారు రైతా, చిన్న కారు రైతా అన్న విషయం పక్కన పెడితే, రైతాంగం ప్రధానమైన భారతంలో అటవీ తరుగుదలలో అతడి పాత్ర తక్కువేమీ కాదని గుర్తించాలి.
జనాభా పెరుగుదలకు తగ్గట్టు ఆ రైతు తన ఇంటి నిర్మాణానికి దూలాలు,వాసాలుగా అడవిని అక్కున చేర్చుకున్నాడు.అట్లాగేవ్యవసాయసాగు కోసం వేలాది ఎకరాలను చదును చేసి అడవిని మైదానం చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో అడవుల తరుగుదల వేగవంతం అయిందనేచెప్పాలి.
అటవీ సంపద తరగడంలో స్మగ్లర్లఆగడాలు, అధికారులనిర్లక్ష్యంసరే సరి. కానీస్వయంగా రైతు కూడా అటవీ భూములను చదును చేసి పర్యావరణానికితీరనినష్టం చేసాడని చెప్పుకోవడంఇప్పటిఅవసరం.
పర్యావరణ ప్రమాదానికి వ్యవసాయమే ఇరుసా!
తనకుటుంబమనుగడ కోసం చిన్నగావ్యవసాయం చేసే రైతు మెలమెల్లగాలాభాపేక్షతోఅంచెలంచెలుగా వ్యవసాయాన్ని తీవ్రతరం చేయడం మొదలు పెట్టాకఅటవీ భూముల తరుగుదలలో కూడా రైతే రాజా? అన్నప్రశ్నఉదయిస్తున్నది.
వ్యవసాయ భూమి కోసం వందలాది ఎకరాల అటవీ భూమిని చదును చేసుకుంటూ విస్తరించిన రైతు, కొన్ని దశాబ్దాలుగా ఆధునిక వ్యవసాయ పద్దతులనన్నీ వాడుకుంటూ వేలాది ఎకరాలను సాగు చేయడం మొదలెట్టాడు. ముఖ్యంగా ట్రాక్టర్ రాకతో అతడి సాగుబడి వేగవంతమైంది.తెలంగాణాలో– సమైక్యాంధ్రలోకాకతీయ చెరువుల నిర్మాణం దెబ్బ తిన్న తరుణంలోశ్రీ రాంసాగర్ ప్రాజెక్టు వంటివాటి వల్ల, తద్వారా అందుబాటులో నీటి వనరుల లభ్యత అధికం కావడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలో రైతు వ్యవసాయాన్ని ఎంతతీవ్రంగా విస్తరించాడో గమనించాలి.ఈ క్రమంలో దేశంలోనే అధికంగా పసుపును సాగు చేస్తున్న తెలంగాణ రైతు కూడా ఉన్నాడు. అతడుకూడాదినదినం అడవి తరిగిపోవడంలోఒకముఖ్యమైన పాత్రపోషిస్తూనే ఉన్నాడని చెప్పాలి.
ముఖ్యమంత్రి సమీక్షలో చేరవలసిన అంశం
ఇటీవలమన ముఖ్యమంత్రి అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక వైపు చెట్లు పెంచడానికి హరిత హారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ,ఇంకోవైపు అడవులు అంతరించి పోతుంటే చూస్తూ కూచోవడం వల్ల లాభం లేదని అన్నారు.ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అడవినికాపాడే విషయంలో అధికారులు కటినంగా వ్యవహరించాలని చెప్పారు. స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ పెట్టడానికి వెనుకాడబోమని కూడా హెచ్చరించారు.పెద్ద ఎత్తున ఉదాసీనంగా ఉన్న అటవీ అధికారులను బదిలీ చేసి సమూలంగా ప్రక్షాళణచేస్తున్నారు.ఐతే, మన రాష్ట్రంలో ముఖ్యంగా పసుపు రైతుల వల్ల అటవీ సంపద పెద్ద ఎత్తున నష్ట పోతున్న సంగతి కూడా వారి దృష్టిలోకి రావాలి.సమీక్ష చేసిప్రత్యామ్నాయం చూడాలి.
తెలిసి తెలిసీ చెట్లను కూలుస్తున్న రైతు
కొంత కాలంగా కోతుల బెడదను ఎదుర్కొంటున్న ఇక్కడి రైతాంగం అందుకుకారణం చెట్లను కొట్టేయడమే అని గ్రహించినప్పటికీ, తిరిగి పసుపు కోసం విధిలేక ఆ పెరిగిన చెట్లను నిర్దాక్షిణ్యంగాకొట్టివేస్తుండటం మరో విషాదం.
బాయిలర్లకు ఇంధనంగా..
నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలు పర్యటిస్తుంటే, ఇక్కడ పసుపు పండిస్తున్న రైతు అనివార్యంగా కలప కోసం తమచేన్లు,తోటల్లో ఉన్న చెట్లనే కాకుండా అనుమతి ఉన్నా లేకున్నాచెక్ పోస్టుల కన్నుగప్పి, సక్రమంగానో అక్రమంగానోవేలాది టన్నుల కలప కొట్టి వేస్తున్నాడని తెలిసింది.ఇందుకు కారణం ఏమిటో కనుక్కుంటే,పసుపు పంటను శుద్ధి చేసి మార్కెట్ చేసుకోవడానికి గానుకలప తప్పని సరి అని, ఇందుకోసంవేలాది చెట్లను నరికివేస్తున్నది వాస్తవమే అనిరైతులుఅంగీకరించారు.
టర్మరిక్ బాయిలర్లతోపెనుసమస్య
అసలు విషయం ఏమిటంటే,పసుపు రైతులు పంట శుద్ధి కోసం ‘టర్మరిక్బాయిలర్’ ను వాడుతారు.ఈ బాయిలర్ నడవడానికిఇంధనంగా వందలాదిటన్నుల కలప ప్రతిరోజూ దహనం కావలసిందే.దీన్ని వారు ‘పబ్’ అంటారు. చూడటానికి కొంచెమే అనిపిస్తుంది గానీ, ఇది కొన్ని దశాబ్దాలుగా నిశబ్దంగా సాగుతోంది.దేశంలోనే పసుపును విరివిగా పండిస్తున్న రైతు చేతుల్లోకొన్ని వేల చెట్లు, లక్షల టన్నుల అటవీ సంపద మాడి మసై పోతున్నదని చెప్పక తప్పదు. రైతులు ‘మేంపనికిరాని కలపనే వాడుతున్నా’మని అంటారు గానీ, అది నిజం కాదని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే తెలుస్తోంది.
ఐతే, టర్మరిక్ బాయిలర్ వాడకానికి ముందు సాంప్రదాయ పొయ్యిలు ఉండేవని, వాటి కారణంగా కలపకే కాదు, తమ ఆరోగ్యానికి కూడా హాని కలిగేదని రైతులు చెప్పారు.
ప్రస్తుతం తమ హాని నుంచి బయట పడ్డ రైతు చెట్లకు హాని చేయకుండా ఉండలేని స్థితి మాత్రం ఉందనే చెప్పాలి.
సమస్యకు పరిష్కారాలు
కాగా,కలప వాడకంతోనే నడిచే టర్మిక్బాయిలర్ల స్థానంలో ఎలక్ట్రిక్ మిషన్లు వినియోగంలోకి తేవడం ఒక ముఖ్య పరిష్కారం అనిరైతులు అభిప్రాయ పడ్డారు.వీలైతే సోలార్ బాయిలర్ ఆవిష్కరణ గురించి కూడా ముఖ్యమంత్రి ఆలోచించాలని సూచించారు.
అలాగేవేస్ట్ ఆయిల్ తో నడిచే బాయిలర్ల ఉన్నాయని విన్నామని, వాటిగురించితమ దగ్గర కూడా ఏవో శిక్షాణా తరగతులు పెట్టారని, సరైన సమాచారం లేదని కూడా రైతులు చెప్పారు.
అలాంటివి ఏవి ఉన్నా, వాటిని పరిచయ చేయడం,రైతులకు శిక్షణ ఇచ్చి వాటిని నిర్వహించడం,సబ్సిడీపైపసుపు రైతుకు ఆయా బాయిలర్లను ఎటువంటి పరిమితి పెట్టకుండా అందుబాటులోకితేవడం తక్షాణావసరం.ఈ మాదిరి పరిష్కారం చూడకుండారైతులనుంచిలక్షలాది చెట్లను రక్షించడంకష్టమనేచెప్పాలి.
కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి
కాగా, అటవీ సంరక్షణ గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్గారుఈ సమస్యను లోతుగాసమీక్షించాలి. అలాగే, పసుపు పండించే ప్రాంతం తన పరిధిలోనే అధికంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట కవిత గారుపసుపు బోర్డు ఏర్పాటుపై ఇదివరకేశ్రద్ద పెట్టారు.ప్రస్తుతంఅటవీ సంరక్షణ విషయంలోబాయిలర్లకుప్రత్యమ్నాయం గురించి తక్షణం ఆలోచించడం, వాటినిఇప్పించేందుకు యుద్దప్రాతిపదికగా కార్యాచరణ తీసుకోవడంఅత్యవసరం.అటు తర్వాత కలప కొట్టేసే రైతుపై కటిన చర్యలు తీసుకోవచ్చు.
అంత్యనిష్టూరం కన్నా ఆది నిష్టూరం
అటవీ సంరక్షణ గురించి దృడమైన విఖరి తెసుకుని పనిచేస్తున్న ప్రభుత్వానికి చిన్న విషయంగా అనిపించేపసుపు రైతు గురించి తెలపడం ఎందుకూ అంటే, ప్రకృతి, పర్యావరణ విద్వంసానికిప్రథమ శత్రువు మానవుడే. అతడివిద్వంసపు పోకడను అదుపు చేయడంలో అతడు రైతా మరోకరా అన్న విచక్షణ అక్కర్లేదు. ‘అభివృద్ధిబాట’పట్టిన రైతును అరికట్టాలి. అందుకుప్రకృతిలోభాగంగా జీవించే జీవన ఇంధనాలు ప్రభుత్వం కనిపెట్టాలి. తప్పదు. అందుకే ఈ వ్యాసం.
-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్.వారం వారం తెలంగాణ క్షేత్రంగా సాగేతన పర్యటన అనుభవాలనుంచి భిన్నమైన ఆలోచనలకు తావిచ్చే అభిప్రాయాలు పంచుకుంటారు.