Lifestyle

ఇలా చేశారంటే ఈ చలికాలంలో బరువు తగ్గడం పక్కా

Image credits: Freepik

చురుగ్గా ఉండండి

చలికాలంలో బద్దకంగా ఉంటుంటారు. కానీ ఈ సీజన్ లో కూడా వ్యాయామం, యోగా వంటి ఇండోర్ వ్యాయామాలను రెగ్యులర్ గా చేస్తే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. 

 

Image credits: Getty

వేడి డ్రింక్స్

షుగర్ డ్రింక్స్ కు బదులుగా గోరువెచ్చని లెమన్ వాటర్, హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటి పానీయాలను తాగితే మీ బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హెల్తీగా బరువు తగ్గుతారు. 

 

Image credits: Getty

సీజనల్ కూరగాయలు

సీజనల్ కూరగాయలను తిన్నా మీరు బరువు తగ్గొచ్చు. ఇందుకోసం బచ్చలికూర, క్యారెట్లు, క్యాబేజీ వంటి కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

అతిగా వద్దు

వేడివేడిగా ఉంటే చాలు చలికాలంలో ఫుడ్ ను ఎంతంటే అంత లాగించేస్తుంటారు. కానీ దీనివల్ల బరువు పెరుగుతారు. కాబట్టి ఎంత టేస్టీగా ఉన్నా లిమిట్ లో తినండి. అప్పుడే బరువు తగ్గుతారు. 

 

Image credits: Getty

ప్రోటీన్‌

బరువు తగ్గాలంటే ప్రోటీన్ ఫుడ్ ను ఖచ్చితంగా తినాలి. ఇందుకోసం పప్పు, చికెన్, టోఫు లీన్ ప్రోటీన్‌ ఫుడ్ ను రెగ్యులర్ గా తినండి. ప్రోటీన్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.

 

Image credits: iSTOCK

హైడ్రేటెడ్

చాలా మంది చలికాలంలో నీళ్లను చాలా తక్కువగా తాగుతుంటారు. కానీ ఈ సీజన్ లో మీరు హైడ్రేట్ గా ఉంటేనే మీ జీవక్రియ పెరిగి బరువు తగ్గుతారు. ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. కొవ్వు కరుగుతుంది.

 

Image credits: Getty

పూర్తి నిద్ర

బరువు తగ్గాలంటే మీరు కంటినిండా నిద్రకూడా పోవాలి. అప్పుడే మీ ఆకలి, జీవక్రియకు సంబంధించిన హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గాలంటే ప్రతిరోజూ 7-8 గంటలు ఖచ్చితంగానిద్రపోవాలి. 

Image credits: social media

రోజుకు ఒక గుడ్డు తింటే ఏమౌతుందో తెలుసా

పురుషులు కచ్చితంగా తినాల్సిన ఆరు ఫుడ్స్ ఇవి

ఇంత అందమా? నయనతార ఏం తింటుందో తెలుసా?

యాలకుల నీటిని రోజూ తాగితే ఏమౌతుంది?