Asianet News TeluguAsianet News Telugu

హౌడీ మోడీ,నమస్తే ట్రంప్: ఇది మాత్రమే తేడా... మిగితాదంతా సేమ్ టు సేమ్

గత సంవత్సరం మోడీ అమెరికా పర్యటన అందరికి గుర్తు రావడం సహజం. అప్పుడు మోడీ అమెరికా వెళ్ళినప్పుడు హౌడీ మోడీ అనే ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ నమస్తే ట్రంప్ అనే ఈవెంట్ లో పాల్గొంటున్నాడు. 

Then Howdi Modi, now Namaste Trump... except for the football and cricket stadium difference everything is same to same
Author
Ahmedabad, First Published Feb 21, 2020, 5:30 PM IST

ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన 24వ తేదీన నేరుగా అహ్మదాబాద్ లో ల్యాండ్ అయి అక్కడ నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొంటారు. ఆయన వెంట ట్రంప్ కూతురు ఇవంక ట్రంప్ కూడా వస్తుంది. 

ఈ అంతటిని చూస్తుంటే... గత సంవత్సరం మోడీ అమెరికా పర్యటన అందరికి గుర్తు రావడం సహజం. అప్పుడు మోడీ అమెరికా వెళ్ళినప్పుడు హౌడీ మోడీ అనే ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ నమస్తే ట్రంప్ అనే ఈవెంట్ లో పాల్గొంటున్నాడు. 

Also read: ట్రంప్ వస్తున్నాడని.. గోడకట్టేసి, బస్తీవాసులను దాచేస్తున్నారు!

ఈ రెండు ఈవెంట్స్ కి కూడా చాలా దగ్గరి పోలికలు మనకు కనబడుతున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించడంతోపాటు ఈ లీడర్ల ఇమేజ్ ను కూడా ఇవి మరింతగా పెంపొందించనున్నాయి. 

గతంలో మోడీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుదు హ్యూస్టన్ లో హౌడీ మోడీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడి ఫుట్ బాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ సభలో మోడీ ప్రసంగించారు. 

మోడీ అక్కడ ప్రసంగిస్తూ... ట్రంప్ తన మిత్రుడని, వారి మధ్య ఉన్న పర్సనల్ రిలేషన్ ని కూడా అందరికి చెప్పే ప్రయత్నం చేసాడు. ఒక రకంగా అమెరికా అధ్యక్షా ఎన్నికలకి ముందు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని మోడీ బలపరిచారు. 

అబ్ కి బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇవ్వడం ద్వారా ట్రంప్ కు అంతర్లీనంగా మద్దతు పలికాడు. అమెరికాలో గణనీయంగా ఉన్న భారత సంతతి ఓటర్లను ట్రంప్ వైపుగా తిప్పేందుకు మోడీ అక్కడ పర్యటించాయి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని అప్పట్లో పలువురు విమర్శించారు కూడా. 

భారత సంతతి అమెరికన్లు సహజంగా డెమొక్రాట్ల మద్దతుదారులు. అలాంటి వారిని రిపబ్లికన్ల వైపుగా ఆకర్షితులను చేసేందుకు ఈ ఉపన్యాసం, ఇలా ట్రంప్ గురించి మోడీ చెప్పడం పనికివచ్చింది. 

Also read; ట్రంప్ భారత పర్యటన: మినిట్ టూ మినిట్ షెడ్యూల్

ఆ ఈవెంట్ జరిగి 5 నెలలయినా గడవక ముందే ఇప్పుడు ట్రంప్ ఇండియా వస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు ట్రంప్ వచ్చి నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొంటే... భారత్ కు, ప్రధాని నరేంద్ర మోడీకి అనేక లాభాలు కనబడుతున్నాయి. 

మొదటగా, ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఈ ఆర్టికల్ రద్దు తరువాత పర్యటిస్తున్న నేపథ్యంలో  ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టవుతుంది. 

భారత నిర్ణయాన్ని అమెరికా గౌరవించినట్టయ్యి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని, కాశ్మీర్ మీద భారత్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కలిగి ఉందనే విషయం ఇక్కడ తేటతెల్లమవుతుంది. 

దానితోపాటుగా ట్రంప్ కి కూడా మరో సారి భారతీయ అమెరికన్లను ఆకర్షించేందుకు ఒక బ్రహ్మాండమైన అవకాశం కలుగుతుంది. ఎలాగూ ట్రంప్ కి అమెరికాలో స్థిరపడ్డ పాకిస్తానీయులు ఓట్లు వేయరు. ఒక మాటకొస్తే... అతడికి ముస్లిం ఓట్లు ఎం రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లో పర్యటించి... ఎన్నికలకు ముందు భారత సంతతి వారి ఓట్లను కొల్లగొడుదామని ఆయన భావిస్తుంటే... మోడీ ఏమో తాను తీసుకున్న నిర్ణయాన్ని అగ్రరాజ్యం స్వాగతించింది అనే విషయాన్నీ ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios