ట్రంప్ వస్తున్నాడని.. గోడకట్టేసి, బస్తీవాసులను దాచేస్తున్నారు!
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మొతేరా క్రికెట్ స్టేడియం వెళ్ళేదారిలో ట్రంప్ కు స్వాగతం పలికేందుకు లక్షల మంది జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఉంటే.... కొన్ని వేల మంది అక్కడి స్థానికులను మాత్రం ఎవ్వరికి కనబడకుండా దాచేసేందుకు గోడను కడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 24, 25వ తేదీల్లో భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన అహ్మదాబాద్ లో మొతేరా క్రికెట్ స్టేడియం ను ప్రారంభించి అక్కడ మోడీతో కలిసి ఉపన్యసించనున్నసంగతి, దానికి నమస్తే ట్రంప్ అని నామకరణం కూడా పెట్టేసిన విషయం తెలిసిందే!
ఆయన అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మొతేరా క్రికెట్ స్టేడియం వెళ్ళేదారిలో ట్రంప్ కు స్వాగతం పలికేందుకు లక్షల మంది జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఉంటే.... కొన్ని వేల మంది అక్కడి స్థానికులను మాత్రం ఎవ్వరికి కనబడకుండా దాచేసేందుకు గోడను కడుతున్నారు.
అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వారు ఒక నాలుగు ఫీట్ల ఎత్తయిన గోడను ట్రంప్ దారిలో స్లమ్ములు ఉన్న చోట నిర్మించారు. తద్వారా ట్రంప్ మోడీల దారిలో తాము కనబడకుండా ఉండడం కోసం ఇలాంటి పనికి ఒడిగడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Also read: ట్రంప్ భారత పర్యటన: మినిట్ టూ మినిట్ షెడ్యూల్
ఇలా గోడ కట్టడంపై సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో విపరీతంగా చర్చకు దారి తీస్తుంది. ఇలా స్లమ్ములను కనబడకుండా చేసినంత మాత్రాన నిజంగా స్లమ్ములు మాయమయిపోతాయా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే... మునిసిపల్ అధికారులు మాత్రం ఈ నిర్ణయాన్నిట్రంప్ రాకకు ముందే తీసుకున్నామని వారు అంటున్నారు. గోడను నిర్మించడానికి వెనక ఉన్న కారణాన్ని కూడా వారు వివరిస్తున్నారు.
స్లమ్ముల దగ్గర ఇలా గోడలు కట్టడం వల్ల భవిష్యత్తులో ఫుట్ పాత్ లను కబ్జాలకు గురవ్వకుండా కాపాడడం కోసమే అని వారు అంటున్నారు. ఈ విషయమై అహ్మదాబాద్ మునిసిపల్ కమీషనర్ విజయ్ నెహ్రా కూడా వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం రెండు నెలల ముందే తీసుకున్నామని ఆయన అన్నారు.
స్వయంగా తాను వెళ్లి అక్కడి స్లమ్ముల్లో నివసించేవారితో మాట్లాడి వారికందరికి ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా తెలిపాడు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియాన్ని ఓపెనింగ్ కి ట్రంప్ వస్తున్న వేళ ఈ చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.