Asianet News TeluguAsianet News Telugu

‘మహా’ సంక్షోభం: ఇప్పటికైనా మేలుకోకపోతే.. తెలుగు సీఎంలు చెల్లించకతప్పదు భారీ మూల్యం

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ పార్టీ నాాయకత్వ స్వీయ తప్పిదాలే ఈ పరిస్థితులను తెచ్చినట్టుగా తెలుస్తున్నది. సీఎం ఉద్ధవ్ ఠాాక్రేను కలువడానికి ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు.. పాార్టీ నిర్మాణంలో, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సీనియర్ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే కూడా పడిగాాపులు పడాల్సి వచ్చిందని, ఆ కాారణంగానే ఆయన మహా వికాాస్ అఘాదీ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసినట్టు తెలుస్తున్నది. ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొన్ని విలువైన పాఠాలు చెబుతున్నాయి.

lessons to telugu states cm kcr and cm jagan from maharashtra political crisis
Author
Hyderabad, First Published Jun 22, 2022, 2:25 PM IST

ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. అధికార పార్టీలోని అసంతృప్తులు ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చే వరకు వెళ్లారు. సీఎం సహా మిగిలిన ఉద్ధండ నేతలు సైతం నిస్సహాయులుగా మిగిలారు. వారే ఏకంగా సీఎంకు అల్టిమేటం పెట్టారు. మహారాష్ట్రలో జరగనున్న క్యాబినెట్ సమావేశం ఇప్పుడు కీలకంగా మారింది. కొవిడ్ పాజిటివ్ సీఎం ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అనంతరం, ప్రభుత్వం కొనసాగుతుందా? అసెంబ్లీ రద్దు అవుతుందా? అనేది వేచి చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటికి రెండు సార్లు ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని చీల్చి కూలగొట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. అది సాధ్యం కాలేదు. అంత పటిష్టంగా ఉన్న ప్రభుత్వం ఉన్నట్టుండి ఎలా పట్టుకోల్పోయింది? ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి సందేశాలను ఇస్తున్నాయి?

భావజాల పరంగా శివసేన, బీజేపీలు సన్నిహిత పార్టీలు. కానీ, సీఎం కుర్చీపై పేచీతో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పొసగలేదు. దీంతో శివసేన సాహసం చేసి లౌకికవాద పార్టీలుగా పేరున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం మహా వికాస్ అఘాదీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో శివసేన పార్టీ నేతలు తమ పూర్తి మద్దతు తెలిపారు. ఆ తర్వాత కూడా బీజేపీ పలుమార్లు శివసేన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించినా తట్టుకుని నిలబడింది. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షోభం అంచున చేరింది. ఈ సంక్షోభానికి కేంద్రకంగా శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే ఉన్నారు.

ఏక్‌నాథ్ షిండే హార్డ్ కోర్ శివ సైనికుడు. బాలా సాహెబ్ నుంచి భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మాస్ లీడర్. కానీ, ఇప్పుడు ఆయనే శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగరేశాడు. ఇందుకు ప్రధాన కారణంగా అగ్రనాయకత్వానికి, ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య గ్యాప్ పెరగడంగా తెలుస్తున్నది. ప్రభుత్వంలో, పార్టీలో కీలక నేత అయినటువంటి ఏక్‌నాథ్ షిండే కూడా సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకోవడానికి పాట్లు పడాల్సి వచ్చిందని, సీఎం ఆయనకు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆగ్రహంతోనే ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసినట్టుగా కథనాలు వచ్చాయి.

శివసేన పార్టీ కోసం, ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేయడమే కాదు.. ఏక్‌నాథ్ షిండే స్వయంగా రాష్ట్ర మంత్రి కూడా. ఆయన కూడా సీఎంను కలువలేకపోవడం ఆయనతోపాటు పార్టీలోని అసంతృప్తులు ఏకం కావడానికి దారితీసింది. అదే ఇప్పుడు ఏకంగా సీఎం పదవికే ఎసరు తెచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు అందరికీ అందుబాటులో లేని వైనాన్ని చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ ఫాం హౌజ్‌లోనే ఉంటారనే అపవాదు ఉండనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా మంత్రులకూ అందుబాటులో ఉండడనే ఆరోపణలు ఉన్నాయి. 

ప్రాంతీయ అస్తిత్వంతో బలమైన పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్ తెలంగాణలో తమకు ఎదురేలేదని, కేసీఆర్‌ను ఎదిరించేవారూ లేరనే వాదనలు జరిగాయి. కానీ, ఆయనకు ఆప్తుడిగా ఉన్న.. పార్టీ ఆవిర్భాం నుంచి తోడుగా ఉన్న ఈటల తిరుగుబాటు చేయడం రాష్ట్రాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం లేకపోవడంతో కేసీఆర్ ఆయన తిరుగుబాటను సులువుగానే ఎదుర్కొన్నారు. అయితే, ఆ తర్వాత నుంచి కేసీఆర్ చాలా వరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటున్నట్టు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లోనూ జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తులు అనేకం ఉన్నారు. వారికీ అదునైన అవకాశం వస్తే పరిస్థితులు ఎటు దారి తీస్తాయో తెలియని పరిస్థితి. ఏపీ క్యాబినెట్ పునర్వ్యస్థీకరణ తర్వాత అసంతృప్తుల గురించిన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అందుకే, పార్టీలో అసంతృప్తులను గుర్తించడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకే కాదు.. ప్రజలకూ అందుబాటులో ఉంటే ఇలాంటి ముప్పులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నివారించవచ్చు. ఇకనైనా సీఎంలు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల నేతగా పేరు తెచ్చుకోవాలని రాజకీయవర్గాలు అభిలాషిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios