Asianet News TeluguAsianet News Telugu

లైంగిక దాడి కేసుల్లో వివాదాస్పద తీర్పులు: ఎవరీ పుష్ప?

లైంగిక దాదుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెలువరించిన పుష్పపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుష్ప ఎవరనే విషయంపై కూడా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో ఆమెపై చర్చ సాగుతోంది.

Controversial judgements: Who is Pushpa?
Author
mumbai, First Published Jan 31, 2021, 8:46 AM IST

న్యూఢిల్లీ: బాలికపై లైంగిక దాడి కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పుష్ప గనేడివాలా గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పోక్సో చట్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శరీరంతో శరీరాన్ని తాకనప్పుడు, దుస్తులను మాత్రమే తాకినప్పుడు నేరంగా పరిగణించలేమని ఆమె తీర్పు చెప్పినప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆమె మరింత ముందుకు వెళ్లి బాలిక చేతులు కట్టేసి, వాటిని పట్టుకుని ప్యాంట్ జిప్ తీసీనంత మాత్రాన పోక్సో చట్టం కింద నేరం కాదని ఆమె తీర్పు చెప్పారు. 

మరో కేసులోనూ ఆమె వివాదాస్పద తీర్పు చెప్పారు. బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రను చేయడం సాధ్యం కాదని, బాధితురాలి సాక్షాయ్్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదని తీర్పు చెప్పారు. ఈ మూడు తీర్పులు వివాదాస్పదంగా మారాయి. దీంతో పుష్పకు సంబంధించి శాశ్వత న్యాయమూర్తి నియామకం సిఫార్సులను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుది. 

ఆ స్థితిలో ఎవరీ పుష్ప అనే ఆసక్తి పెరిగింది. పుష్ప మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల పరాఠ్వాడాలో 1969లో జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టాలు తీసుకున్నారు. 2007లో తొలిసారి జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ముంబైలోని సిటీ సివిల్ కోర్టు, నాగపూర్ జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 

ఆ తర్వాత 2018లో జస్టిస్ పుష్ప బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే న్యాయస్థానం వ్యతిరేకించడంతో ఆమె కొన్నాళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు అందుకు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు నిరాశే మిగిలింది. అయితే, 2019లో జస్టిస్ పుష్ప నియామకం ఖరారైంది. దాంతో బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆమెకు అవకాశం దక్కింది. 

పెరోల్ కు సంబంధించి ఖైదీలకు ఉన్న పరిమిత హక్కల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన బెంచ్ లో జస్టిస్ పీఎన్ దేశ్ ముఖ్, జస్టిస్ పితాలేలతో పాటు పుష్ప కూడా ఉన్నారు. పెరోల్ అనేది కేవలం అడ్నినిస్ట్రేటివ్ నిర్ణయం కాదని, దానికి సంబంధించిన ప్రొవిజన్ మీద బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్ల నిబంధనలకు సంబంధించి ప్రిజన్ రూల్స్ 1959లోని యాక్ట్ 1894లోని సెక్షన్ 59(5)లో కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు సరికావని బెంచ్ వ్యాఖ్యానించింది. 

2019లో హత్యానేరం దోషులకు పడిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ రెండు కేసుల్లో తీర్పు ఇచ్చిన బెంచ్ లో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు. మరికొన్ని కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉ్న జస్టిస్ పుష్ప ఈ ఏడాది జనవరి, జనవరి 2021 నాటి పోక్సో చట్టం కింద అరెస్టయిన నిందితులకు సిఖ్, పడదని తీర్పు చెప్పి చర్చలోకి వచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios