Asianet News TeluguAsianet News Telugu

Ayodhya verdict: తదుపరి అడుగులు ఉమ్మడి పౌర స్మృతి వైపేనా?

అయోధ్య తీర్పు కూడా వెలువడడంతో తమ ఎన్నికల అజెండాలోని తదుపరి అంశాలపైన బీజేపీ దృష్టి సారించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ మొదలయ్యింది. 

Ayodhya Verdict: Is Uniform Civil Code the next?
Author
New Delhi, First Published Nov 10, 2019, 2:29 PM IST

సంఘ్ పరివార్, బిజెపిలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తుండగా, మరికొందరు సుప్రీంకోర్టు వివాదాస్పద స్థలాన్ని అధికార బిజెపికి అప్పగించిందని ఆక్షేపించారు.బాబ్రీ మసీదును కూల్చివేసిన వ్యక్తులు ఎందరో ఇప్పుడు నాయకులుగా  బీజేపీలో కొనసాగుతున్నారనేది వారి ఆరోపణ. 

Also read: Ayodhya Verdict: సుప్రీమ్ ప్రయోగించిన అస్త్రం.... ఆర్టికల్ 142

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు  ఈ తీర్పును "అన్యాయం" గా అభివర్ణిస్తూ, ఈ తీర్పు ద్వారా కేవలం రాముడి ఆలయానికి మార్గం సుగమం చేయడమే కాకుండా, కర సేవకులు మసీదును కూల్చివేసిన తరువాత చేసిన "మందిర్ వహి బానయేంగే" (ఆలయాన్ని అక్కడే నిర్మిస్తాము) అనే నినాదాన్ని చట్టబద్ధం చేసినట్టయ్యిందని అభిప్రాయపడింది. 

సుప్రీంకోర్టు తీర్పు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. "హిందూ హృదయ సామ్రాట్" గా, హిందుత్వ సిద్ధాంత అసలు సిసలైన పోస్టర్ బాయ్ గా మారిపోయారు. రామ్ జన్మభూమి ఉద్యమ వాస్తుశిల్పి ఎల్.కె. అద్వానీ, మ్ది నీడలో మిగిలిపోవాలిసి వచ్చింది. పార్టీలో ఎవరూ కూడా  ఈ కురువృద్ధుడి గురించి మాట్లాడడం లేదు. 

Also read: ఇది అద్వానీ ఘనతే.. 24న అయోధ్యకు వెళ్తున్నా: శివసేన చీఫ్ ఉద్థవ్ థాక్రే

తీర్పు వెలువడ్డాక నిన్న సాయంత్రం, అద్వానీ ఒక చిన్న ప్రకటనను విడుదల చేశారు. "సుప్రీంకోర్టు తన ఏకగ్రీవ తీర్పుతో, అద్భుతమైన రాముడి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిందుకు నేను సంతోషిస్తున్నాను." అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

రామ జన్మభూమి వివాద పరిష్కారం ఒక హిందూ రాష్ట్రాన్ని స్థాపించే గొప్ప దారిలో దేశాన్ని పయనింప చేస్తున్న మోడీ నాయకత్వ కిరీటంలో ఒక కలికితురాయని కొందరు హిందుత్వ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 

ఏదేమైనా, దేశ పాలనను చేపట్టిన తరువాత, ప్రధానమంత్రి ఎప్పుడూ  వన్ ఇండియా అనే మాట్లాడుతూ ఉంటారు.  నిత్యం  సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగానే, అయోధ్య తీర్పును ఎవరి విజయంగా కానీ లేదా ఓటమిగా కానీ పరిగణించవద్దని ఆయన దేశ ప్రజలను కోరారు.

తీర్పు వెలువడిన కొన్ని గంటల తరువాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ,  "నవంబర్ 9, నేటితో కక్ష, ఈర్షా ద్వేషాలకు చరమగీతం పాడుదాం" అని అన్నారు. ప్రస్తుత భారతదేశంలో భయానికి, కోపతాపాలకు,నెగటివిటీకి చోటులేదన్నారు. 

Also read: Ayodhya Verdict: కాశ్మీర్ టు అయోధ్య వయా కర్తార్ పూర్

ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో, బిజెపి ప్రభుత్వం తన అజెండాలోని అన్ని హిందుత్వ వాగ్ధానాలను దాదాపుగా పూర్తి చేసింది - ఆర్టికల్ 370, ఎన్‌ఆర్‌సిని రద్దు చేయడం. 

"యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)" మాత్రమే మిగిలి ఉన్న ప్రధాన సమస్య. రానున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఈ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన  బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆస్కారమే లేకపోలేదు. లోక్ సభలో బ్రహ్మాండమైన మెజారిటీ వారి సొంతం. రాజ్యసభలో కూడా పావులు కదపడం ద్వారా వారికి కావలిసిన చట్టాలను సునాయాసంగా పాస్ చేయించుకుంటున్నారు. 

ఉమ్మడి పౌర స్మృతి విషయంలో బీజేపీ ఎప్పటినుంచో తన వైఖరిని బహిరంగంగానే ప్రకటించింది. ఎన్నికల మానిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరిచారు. అన్నిటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనీ పేర్కొన్నారు. కాబట్టి ఇదేదో హిందుత్వ వాదం కోసం బీజేపీ తీసుకుంటున్న చర్య అనే కన్నా రాజ్యాంగంలో ఉన్న ఒక ఆదేశిక సూత్రానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది. 

Also read: ayodhya verdict: అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం.. వారికి కోర్టు ప్రశంసలు

ఇప్పటికే ట్రిపుల్ తలాక్ అంశంలో అది చెల్లుబాటు కాకుండా చట్టం తీసుకువచ్చింది. తద్వారా సివిల్ చట్టంలో ఒక ముఖ్య అంశమైన పెళ్లిని మామూలు చట్ట పరిధి కిందికి తీసుకొని వచ్చారు. ఈ చట్టం లోని లోటుపాట్లను పక్కన పెడితే ఈ చట్టాన్ని ముస్లిం మహిళలు కూడా ఆహ్వానించారు. కారణం- ఈ డిమాండ్ ముస్లిం మహిళాల్లోంచి బయటికి వచ్చింది. 

ఆర్థిక మందగమనం వల్ల ఒకింత డిఫెన్సె లో పడ్డ ప్రభుత్వానికి, అసెంబ్లీ  ఎన్నికలలో  ఊహించని షాకే తగిలింది. ఈ అన్ని షాకుల వల్ల ఇబ్బందుల్లో పడ్డ ప్రభుత్వానికి  కోర్టు తీర్పు పార్టీకి పెద్ద బూస్ట్ అని మాత్రం చెప్పక తప్పదు. 

Follow Us:
Download App:
  • android
  • ios