Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో సత్తా చాటిన తెలుగు విద్యార్ధిని.. రూ.2 కోట్ల భారీ వేతనంతో ఉద్యోగం

ప్రాంగణ నియామకాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన దీప్తి అనే యువతి అమెరికాలోని ప్రముఖ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం లభించింది. సియాటెల్‌లో వున్న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో దీప్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించారు

hyderabad teenager gets job in america ksp
Author
Seattle, First Published May 16, 2021, 2:22 PM IST

ప్రాంగణ నియామకాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన దీప్తి అనే యువతి అమెరికాలోని ప్రముఖ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం లభించింది. సియాటెల్‌లో వున్న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో దీప్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించారు.

యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఈ నెల 2న ఎంఎస్ (కంప్యూటర్స్)పూర్తి చేసిన దీప్తి.. క్యాంపస్ ఇంటర్యూలో ఈ ఉద్యోగాన్ని సాధించారు. ఈ నెల 17 ఆమె ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా.. దీప్తి తండ్రి వెంకన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో క్లూస్‌టీం విభాగం అధిపతిగా పని చేస్తున్నారు.

బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో దీప్తి మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లారు.

ఈ క్రమంలో ఫ్లోరిడా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇటీవల అక్కడ జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 300 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిందరిలోనూ దీప్తికి అత్యధిక వేతనం లభించడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios