Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. బాలిక తననే ప్రేమిస్తుందని నిరూపించుకునేందుకు అత్యాచారం..వీడియో తీసి...

ప్రేమికుడినని నిరూపించుకునేందుకు ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. బాలిక మీద అత్యాచారం చేసి, వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. 

youth molested girl over love issues in jharkhand
Author
First Published Sep 20, 2022, 7:29 AM IST

జార్ఖండ్ : జార్ఖండ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై యువకుడు దాష్టీకానికి పడ్డాడు. ఆమె తనను ప్రేమిస్తోందని స్నేహితుల ముందు రుజువు చేసుకునేందుకు బాలిక మీద అత్యాచారానికి తెగబడ్డాడు.  వివరాల్లోకి వెళితే…  కోయలంచల్ ధన్ బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల మధ్య ఓ బాలిక విషయంలో ఇటీవల గొడవ జరిగింది. ఆమె తనను ప్రేమిస్తుందని యువకుల్లో ఒకరు చెప్పారు. దీంతో తననే ప్రేమిస్తోందని సంజయ్ అనే మరో వ్యక్తి వాదించాడు. 

అంతేకాదు, తానే ఆమె ప్రేమికుడినని నిరూపించుకుంటానని.. వారి ముందు సవాలు చేశాడు. మరుసటిరోజు బాలికకు మాయమాటలు చెప్పి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆధారాలు వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. వారు ఆ వీడియోను బంధువులకు చూపించడంతో జరిగిన ఘోరం వెలుగు లోకి వచ్చింది.  బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు.

లిఫ్ట్ అడిగి ప్రాణం తీశాడు.. పథకం ప్రకారమే హత్యా!?.. పిచ్చికుక్కలను చంపేందుకు వాడే విషంతో ఇంజక్షన్..!!

ఇదిలా ఉండగా, మైనర్ బాలిక(17)పై చిన్నాన్న అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో చోటు చేసుకుంది. 9వ తరగతి వరకు చదివి బాలిక బడి మానేసింది. మూడేళ్ల నుంచి చిన్నాన్న, చిన్నమ్మల వద్ద ఉంటుంది. ఇటీవల ఆశ కార్యకర్త గ్రామానికి వచ్చినప్పుడు బాలిక కడుపుతో ఉన్న విషయం చూసింది. విచారించగా చిన్నాన్న లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఫిబ్రవరి నెలలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని బాలిక పోలీసుల విచారణలో తెలిపింది. కామాంధుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో దారుణమైన సంఘటన జరిగింది. మైనర్ బాలికను కిడ్పాప్ చేసిన యువకులు ఓ లాడ్జీలో సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు బాలికను లాడ్జీకి తీసుకుని వెళ్లి మత్తుమందు ఇచ్చారు. 

ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెను లాడ్జీలోనే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios