Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల యువతి అదృశ్యం.. 22 రోజుల తర్వాత అస్థిపంజరంగా లభ్యం.. యూపీలో దారుణం

ఉత్తరప్రదేశ్‌లో విశాల్ మెగా మార్ట్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న యువతి అదృశ్యమైంది. 22 రోజుల తర్వాత విగత జీవిగా కనిపించింది. ఓ చెరుకు తోట సమీపంలో అస్థిపంజరంగా కనిపించింది. ఓ దుండగుడు రేప్ చేసే ప్రయత్నం చేయగా ప్రతిఘటించింది. దీంతో ఆ దుండగుడు యువతిని చంపేశాడు.

UP woman found as skeleton after 22 days
Author
First Published Sep 19, 2022, 7:43 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. విశాల్ మెగా మార్ట్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న ఓ యువతి కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేశారు. 22 రోజుల తర్వాత ఆమె అస్థిపంజరం రూపంలో కనిపించింది. ఆమె డెడ్ బాడీ ఓ చెరుకు తోట సమీపంలో కనిపించింది. ఈ ఘటన యూపీలోని అయోధ్య జిల్లాలో చోటుచేసుకుంది.

20 ఏళ్ల యువతి అయోధ్యలోని విశాల్ మెగా మార్ట్‌లో క్యాషియర్‌గా పని చేసేది. ప్రతి రోజు ఇంటి నుంచి వెళ్లి డ్యూటీ చేసుకుని సాయంత్రానికల్లా ఇల్లు చేరేది. కానీ, ఆగస్టు 27వ తేదీన ఆమె మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు చాలా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ యువతి ఓ ఇరిక్షాలో ఎక్కుతుండగా చివరి సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. అక్కడి నుంచి పోలీసులు సెర్చ్ ముమ్మరం చేశారు. చివరకు ఆ ఆటో డ్రైవర్‌ను పట్టుకున్నారు.

ఆటో డ్రైవర్ సహాయంతో ఈ కేసులో నిందితుడు అనూప్ సింగ్‌ను ఆయన గ్రామంలో పట్టుకున్నారు. అనూప్ సింగ్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ యువతికి అద్దె గదిని వెతికి పెడతానని ఆమెను మభ్య పెట్టినట్టు అనూప్ సింగ్ పోలీసులకు తెలిపాడు. ఆ యువతికి ఎంతమాత్రం అనుమానం రాకుండా ఆమెతో వ్యవహరించాడు. ఓ చోట డ్రింక్ కూడా తాగారు. ఆ తర్వాత ఆమెను ఆ యువకుడి అతని గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడు.

కానీ, ఆ యువతి ప్రతిఘటించింది. దీంతో ఆమెను అక్కడే హతమార్చాడు. ఆమె బాడీని ఆ ఊరికి సమీపంలోని చెరుకు తోటలో విసిరేశాడు. ఆ తర్వాత యువతికి చెందిన పర్సు, మొబైల్ ఫోన్‌ను పట్టుకుని స్పాట్ నుంచి పారిపోయాడు. అనూప్ సింగ్ ఇచ్చిన సమాచారంతో ఆ యువతి డెడ్‌బాడీని 22 రోజుల తర్వాత కనుగొన్నట్టు సీవో సిటీ శైలేంద్ర సింగ్ వివరించారు. ఆ చెరుకు తోటలో యువతి అస్థిపంజరం లభించింది. ఆ బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పోలీసులు ఆ యువతి ఐడీకార్డ్, బట్టలు, షూలు, వెంట్రుకలు, అనూప్ సింగ్ ఆధార్ కార్డు కూడా కనుగొన్నట్టు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios