Asianet News TeluguAsianet News Telugu

Narendra Modi Vs Rahul Gandhi: పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ దే హవా.. మరీ రాహుల్ పరిస్థితేంటీ? 

Narendra Modi Vs Rahul Gandhi: సార్వత్రిక సమరం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే మూడు దశలలో పోలింగ్ పూర్తి కాగా.. నాలుగో దశ పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో ఎవరు అధికారం చేపట్టనున్నారు? ఈ ఎన్నికలలో గెలుపు ఏ పార్టీని వరిస్తుంది? అధికారం ఏ పార్టీకి దక్కుతుంది?  అనేది ప్రధాన ప్రశ్నలుగా మారాయి. ఈ తరుణంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీన్ కీలక విషయాన్ని వెల్లడించారు.  ఆ విషయాలేంటో తెలుసుకుందాం.? 

Narendra Modi Vs Rahul Gandhi the challenger in the lok sabha election is missing shrin KRJ
Author
First Published May 9, 2024, 4:49 PM IST

Narendra Modi Vs Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికల సమరం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే మూడు దశలలో పోలింగ్ పూర్తి కాగా.. నాలుగో దశ పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అంటే దాదాపు సగానికి పైగా స్థానాలలో ఎన్నికలు పూర్తయ్యాయన్నమాట. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో ఎవరు అధికారం చేపట్టనున్నారు? ఈ ఎన్నికలలో గెలుపు ఏ పార్టీని వరిస్తుంది? అధికారం ఏ పార్టీకి దక్కుతుంది?  అనేది ప్రధాన ప్రశ్నలుగా మారాయి. అయితే.. దాదాపు అన్ని సర్వేలు బీజేపీ (ఎన్డీఏ)కూటమి వైపే ముగ్గు చూపుతున్నాయి.

ముచ్చటగా మూడోసారి బిజెపి అధికార పగ్గాలను చేపడుతుందని,  నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే పలు సర్వేలు, అటు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఆ వాదనకు మరింత బలం చేకూరేలా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీన్ తన ట్విట్టర్ వేదికగా ఓ కీలక క్విట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలు, ఇరు నేతలు చేపడుతున్న కార్యక్రమాలు, హాజరవుతున్న ర్యాలీలు, బహిరంగ సభలను వివరాలను వెల్లడిస్తూ కీలక సమాచారాన్ని వెల్లడించారు.

ఈ ఇందులో నక్కకు నాగ లోకానికి  ఎలాంటి తేడా ఉందో.. రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీకి కూడా అలాంటి తేడానే ఉందని, అలాగే..  బిజెపి ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ లు గెలుచుకునే స్థానాల మధ్య భారీ తేడా ఉందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ  అధిక స్థానాల్లో గెలుపు బావుట  ఎగరవేస్తుందో వెల్లడించారు.

రాజకీయ విశ్లేషకులు శ్రీన్ ప్రకారం...బీజేపీ, ఎన్డీయే సీట్లపై అంచనా.. 

బీజేపీ, ఎన్డీఏల సీట్ల సంఖ్యకు సంబంధించి అంచనాలు భిన్నంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి రాజకీయ, ఎన్నికల విశ్లేషకులు మాత్రం నరేంద్ర మోదీ ముందున్నారని నమ్ముతున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషకుడు శ్రీన్ తన పోస్ట్‌లో ఇలా వివరణ ఇచ్చారు.

ప్రధాని మోదీ ప్రచారం ఇలా..

>> లోక్‌సభ ఎన్నికల ప్రకటన తరువాత ప్రధాని మోడీ ప్రచార శైలిని చూడండి. ప్రధాని మార్చిలో 9 ర్యాలీలు , సమావేశాలు, ఏప్రిల్‌లో 68 , మేలో మొత్తం 26 ర్యాలీలు నిర్వహించారు. 

>>ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ  ప్రధాని మోడీ మార్చి నుండి ఇప్పటి వరకు మీడియాకు మొత్తం 24 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ప్రాంతీయ (తంతి టీవీ, అస్సాం ట్రిబ్యూన్, ఏషియానెట్ గ్రూప్, విజయవాణి, న్యూస్18, సకల్, ఈనాడు, కచ్ మిత్ర, దివ్య భాస్కర్, గుజరాత్ సమాచార్, ఫుల్‌చాబ్, సందేశ్ న్యూస్, ఆనంద్ బజార్ పత్రిక), జాతీయ (హిందూస్థాన్, హిందుస్థాన్ టైమ్స్, ANI, దైనిక్ జాగరణ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూస్18, టైమ్స్ నౌ), అంతర్జాతీయ (న్యూస్‌వీక్) మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. 

>>అలాగే.. ఎన్నికల ప్రకటన తర్వాత ప్రధాని కూడా 21 రోడ్ షోలు నిర్వహించారు. దేవాలయాలు, గురుద్వారాలను లెక్కలేనన్ని సందర్శనలు చేశారని ఆయన చెప్పారు. ఎంతో మంది ప్రముఖులు, సామాన్య పౌరులను ప్రధాని మోడీ స్వయంగా కలిశారు.

రాహుల్ గాంధీ  ప్రచారం ఇలా.. 

>> రాహుల్ గాంధీ న్యాయ యాత్ర మార్చి 17న ముగిసింది.

>> అప్పటి నుంచి మే 8 వరకు రాహుల్ 39 బహిరంగ సభలు నిర్వహించారు. ఇందులో మార్చిలో 1, ఏప్రిల్‌లో 29, మేలో 10 కేవలం 3 బహిరంగ సభలు మాత్రమే ఉన్నాయి.

>> కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ సమావేశాలు జరిగాయి. కానీ, ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి రాహుల్ గాంధీ ఎలాంటి ఇంటర్వ్యూలు చేయలేదు.

>> న్యాయ్ యాత్ర , INDIA కూటమి సమావేశాల్లో తప్ప వేరే సమయంలో విలేకరుల సమావేశాలు నిర్వహించలేదు. ఇక సోషల్ మీడియా ప్రొజెక్షన్ కోసం కాంగ్రెస్ ఐటీ సెల్‌తో చర్చలు జరిగాయి.

>> రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగానే తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కానీ,  మీడియాతో ఇంటరాక్షన్ లేదా ఇంటర్వ్యూలు లేవు. 

కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి ?

>> రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన పార్టీ ఎందుకు యాక్టివ్ గా ప్రచారం చేపట్టలేకపోతుంది? 

>> బీజేపీ చేపట్టిన ప్రచారంలో కాంగ్రెస్ కేవలం మూడింట ఒక వంతు మాత్రమే చేస్తే ఏలా?

>> ఈ ఎన్నికల సమయంలో 24-36 గంటలపాటు ప్రచారానికి దూరంగా ఉండటం ఎలా?

>> పబ్లిసిటీ కోసం మెయిన్ స్ట్రీమ్ లేదా సోషల్ మీడియాలోకి వెళ్లకపోతే ఎలా?

>> రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో ఎందుకు కనిపించడం లేదు?

>>పార్టీకి నష్టాన్ని తగ్గించుకునేందుకే కాంగ్రెస్ అధినేతను దాస్తోందా?

>>బీజేపీ హావా ముందు కాంగ్రెస్ నిలువలేకపోతుందా? 

>>నరేంద్ర మోడికి ఎదుర్కొవడం రాహుల్ గాంధీకి సాధ్యం కావడం లేదా? 

>>  క్షమించండి, కానీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. 

ఏదిఏమైనా.. నరేంద్ర మోడీ అండ్ కో నిర్వహించిన విధంగా  రాహుల్ గాంధీ అండ్ టీ ప్రచారం నిర్వహించలేక పోతుందనేది వాస్తవం. మరీ ప్రజా తీర్పు ఎలా ఉంటుందో? ఎవరు అధికారం చేపడుతారో ఎన్నికల ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios