ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లైన 10 రోజుల్లోనే భార్య లవర్‌తో పారిపోగా, భర్త మాత్రం హనీమూన్ కి తీసుకుని వెళ్లి చంపేయలేదు కదా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ చరిత్రలో భారీ బడ్జెట్ ను యోగి సర్కార్ ప్రవేశపెట్టింది. అందరికీ ప్రత్యేక పథకాలు. వృద్ధులు, రైతులు, విద్యార్థులు, దివ్యాంగులు, మైనారిటీలకు ఊరట ప్రకటనలు ఇచ్చారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Govt) వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. గతంలో నోయిడాలో రాత్రి 8 గంటల తర్వాత కోచింగ్ సెంటర్లు నిర్వహించరాదని, ప్రధానంగా రాత్రి 8 గంటల తర్వాత బాలికలకు తరగతులను నిర్వహించరాదని విధించిన నిషేధాన్ని రాష్ట్రప్రభుత్వం ఎత్తివేసింది.
ఇజ్రాయెలీ యువతులపై హమాస్ దుండగులు దాష్టీకాలతో కలత చెంది ఇస్లాంను వదిలిపెట్టినట్టు యూపీకి చెందిన 23 ఏళ్ల ముస్కాన్ సిద్ధిఖీ ఓ అఫిడవిట్లో పేర్కొంది. ఆ తర్వాత హిందూ మతానికి చెందిన శిశుపాల్ మౌర్యను పెళ్లి చేసుకుంది.
Uttar Pradesh: ఓ విద్యార్థి పట్ల ఉపాద్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. 11 ఏళ్ల విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు బాత్రూమ్లో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ఆ పిల్లవాడు సుమారు 18 గంటలపాటు టాయిలెట్లోనే ఉండిపోయాడు. తరువాత రోజు ఉదయం వేరే ఉపాధ్యాయులు బాత్రూమ్ డోర్‌ను తెరవగా బయటకొచ్చాడు బాలుడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
Energy Day: ఉత్తరప్రదేశ్‌లో ఎలక్ట్రిసిటీ ఫెస్టివల్, ఎనర్జీ డే సందర్భంగా 12 విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ సెంటర్లను ప్రారంభించగా, మరో ఐదింటికి శంకుస్థాపన చేశారు.
Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం చేస్తున్న సమయంలో మామిడి పండు కావాలని పదే పదే అడిగినందుకు తన 5 ఏళ్ల మేనకోడలును అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ మేనమామ.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తమ మంత్రి వర్గం నుంచి మంత్రి దినేష్ ఖటిక్ రాజీనామా చేశారు. తనని దళితుడనే.. ఎలాంటి బాధ్యతలివ్వలేదని, తనను పక్కన పెట్టారని ఫిర్యాదు చేస్తూ రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహంగుఖేడా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, మహిళ టీచర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా వచ్చిందని ప్రధానోపాధ్యాయుడు..టీచర్ పై బూటుతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు.
Supreme Court: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత వారం హింసాత్మక నిరసనలకు కారణమైనందుకు అరెస్టు చేసిన వారిపై యూపీ ప్రభుత్వం చేపట్టిన ఆస్తుల కూల్చివేతపై స్టే విధించాలని జమియత్ ఉలమా ఐ హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.