భారత్ లో హిందువులు తగ్గిపోయారు... జెట్ స్పీడ్ తో పెరిగిన ముస్లింలు.: పీఎం ఆర్థిక సలహా మండలి లెక్కలివీ...

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో మతాలవారిగా జనాభా నిష్పత్తిని ప్రస్తుతం రోజులతో పోలిస్తే చాలా మార్పులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రోజురోజుకు మెజారిటీ హిందువల శాతం తగ్గితే మైనారిటీ ముస్లింల జనాభా పెరుగుతోందట.... 

Hindu population shrank 7 percent and muslims grew 43 percent in India during 1950 to 2015 AKP

లోక్ సభ ఎన్నికల వేళ రిజర్వేషన్లపై వివాదం రాజుకుంది. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బిజెపి అంటుంటే... కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని అంటోంది. ఇలా బిజెపి మెజారిటీ హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే... ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి భారతదేశ జనాభా గురించి అధ్యయనం చేసింది. దీని ప్రకారం... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటే 1950 నుండి 2015 వరకు  దేశంలో మతాల వారిగా జనాబాను పరిశీలిస్తే హిందువుల్లో తగ్గుదల వుంటే... ముస్లింలలో గణనీయమైన పెరుగుదల వుంది. ఇప్పటికీ హిందువులే మెజారిటీ అయినప్పటికీ గతంతో పోలిస్తే 7.81 శాతం తగ్గింది. అంటే 2015 నాటికి దేశంలో హిందూ జనాభా 78.06 శాతంగా వుంది.... ఇదే 1950 లో అయితే 85 శాతంగా వుండేదని పీఎం ఆర్థిక సలహా మండలి అధ్యయనం చెబుతోంది. 

ఇదే సమయంలో అంటే 1950-2015 మధ్య ముస్లిం జనాభా భారీగా పెరిగినట్లు ప్రకటించారు.  ఏకంగా 43.15 శాతం పెరుగుదలను నమోదయినట్లు తెలుస్తోంది. ఇలా జెట్ స్పీడ్ తో పెరుగుతున్న ముస్లిం జనాభా ప్రస్తుతం దేశ జనాభాలో 14.09 శాతానికి పెరిగింది. అంటే గతంలో కంటే ప్రస్తుతం భారతదేశంలో ముస్లింల సంఖ్య అధికమని పీఎం ఆర్థిక సలహా మండలి లెక్కలు చెబుతున్నాయి. 

 

దేశంలో క్రిస్టియన్ జనాభా కూడా పెరుగుతోందని... 5.4 శాతం పెరుగుదలతో మొత్తం జనాభాలో 2.36 శాతానికి చేరుకుందట. సిక్కులు, బుద్ధిస్ట్ ల జనాభా కూడా పెరుగుతోందట. 2015 నాటికి దేశ జనాభాలో సిక్కులు 1.85 మరియు బుద్ధిస్ట్ లు 0.81 శాతానికి చేరుకున్నారు.  

హిందువుల మాదిరిగానే జైనులు, పారసీల జనాభా తగ్గుతూ వస్తోందట. దేశ జనాభాలో జైనులు 0.36, పారసీలు 0.004 శాతానికి చేరుకున్నారు. ఇలా 1950-2015 వరకు కొన్ని మతాల జనాభా తగ్గితే... మరికొన్ని మతాల జనాభా పెరుగుతూ వస్తోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనం తేల్చింది. 

అయితే కేవలం భారతదేశంలోనే కాదు చుట్టుపక్కల దేశాల్లో జనాభా పెరుగుదలను కూడా పరిశీలించినట్లు పీఎం ఆర్థిక సలహా మండలి తెలిపింది. ఈ క్రమంలోనే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో మైనారిటీలు చాలా సురక్షితంగా వున్నారని... గతంతో పోలిస్తే మరింత అభివృద్ది చెందినట్లు డేటా సూచిస్తోంది. ఇదే సమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, అప్ఘానిస్తాన్ దేశాలో మెజారిటీ ప్రజల జనాభాశాతం పెరుగుతుంటే... మైనారిటీల శాతం తగ్గుతూ వచ్చిందన్నారు. అంటే ఆ దేశాల్లో మైనారిటీలకు రక్షణ లేదని... వారి పరిస్థితి దారుణంగా వుందని ఈ అధ్యయనం ద్వారా అర్థమవుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మెజారిటీ జనాభాలో తగ్గుదల కనిపిస్తోంది. మెజారిటీ మతాల జనాభాలో సుమారుగా 22% తగ్గుదల కనిపిస్తోందని పీఎం సలహా మండలి వెల్లడించింది. అయితే మెజారిటీ మతాల జనాభా పెరుగుల కలిగిన వాటిలో ముస్లిం, క్రిస్టియన్ దేశాలే ఎక్కువగా వున్నాయట. ఇదే సమయంలో మెజారిటీ మతాల జనాభా తగ్గుదల కలిగిన దేశాల్లో మాత్రం ముస్లిం, క్రిస్టియన్ దేశాలు కేవలం ఒకటిరెండు మాత్రమే వున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం, క్రిస్టియన్ జనాభా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనం చేబుతోంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios