కాశ్మీర్: ఎల్ ఓ సి వెంబడి పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారతదేశంవైపు పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు సాధారణ భారతీయ పౌరులు గాయపడ్డారు. పాకిస్తాన్ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతూంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

నిన్న కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారు. ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులతో పాటు ఒక జవాన్ కూడా మరణించాడు. మరో ఉగ్రవాది యాపిల్ పండ్ల ట్రక్కులో దాక్కొని ప్రయాణిస్తుంటే భద్రతా బలగాలు అరెస్ట్ చేసాయి. 

పాకిస్తాన్ శాంతి కోసం పరితపిస్తుందని మొన్ననే ఐరాసలో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఏమని సమాధానం చెబుతాడో వేచి చూడాలి.