Asianet News TeluguAsianet News Telugu

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

కేరళ రాష్ట్రంలోని శబరిమలలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది.  భారీ పోలీసు బందోబస్తు మధ్య మహిళలను ఆలయంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Sabarimala Temple      Cops Advise Women to Abort Plan Amid Standoff With Protesters at Entry Point
Author
Sabarimala, First Published Oct 19, 2018, 10:19 AM IST

శబరిమల:కేరళ రాష్ట్రంలోని శబరిమలలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది.  భారీ పోలీసు బందోబస్తు మధ్య మహిళలను ఆలయంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో శుక్రవారం నాడు కూడ శబరిమల ఆలయ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళలను  ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకొంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టెంబర్  మాసంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు తీర్పును పాటిస్తామని కేరళ సీఎం విజయన్ ప్రకటించారు.

దీంతో హిందూ సంఘాలు, సంప్రదాయవాదులు  మహిళలు  ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకొంటామని హెచ్చరించారు. శుక్రవారం నాడు ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు  వచ్చారు. 

భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇద్దరు మహిళలను  పోలీసులు శబరిమల  ఆలయ ప్రవేశం కోసం తీసుకెళ్తున్నారు.  పోలీసులు ధరించే బుల్లెట్ ఫ్రూప్ జాకెట్,హెల్మెట్ ధరించి మహిళలు  అయ్యప్ప  దర్శనం కోసం బయలుదేరారు.

 ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన మహిళలు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉన్నారు. అయితే  ఆందోళనకారులు వారిని అడ్డుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో ఆ ప్రాంతంలో  పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది.

ఇదిలా ఉంటే శుక్రవారం నాడు అయ్యప్ప ఆలయ బోర్డు  సమావేశం కానుంది.ఈ బోర్డు  అయ్యప్ప ఆలయంలోకి  మహిళలను ప్రవేశించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే విషయమై  చర్చించే అవకాశం ఉన్నట్టు  సమాచారం. 

సంబంధిత వార్తలు

సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదు: శబరిమల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

శబరిమలలో ఉద్రిక్తతే: న్యూయార్క్ టైమ్స్ లేడీ జర్నలిస్టుపై దాడి

శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios