తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆయలంలోకి మహిళా భక్తులకు ప్రవేశం కల్పించేందుకు వీలుగా  కేరళ సర్కార్  అన్ని ఏర్పాట్లు చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళా భక్తులు  వెళ్లేలా పోలీసులు రక్షణ కల్పించారు.

 

 

శబరిమల ఆలయంలోకి  అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన మహిళలను  పోలీసుల భద్రత మధ్య కొండపైకి పంపుతున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు  వస్తున్న మహిళలపై సంప్రదాయవాదులు రాళ్లతో దాడి చేశారు.

ఏపీ నుండి వచ్చిన కుటుంబంలో కూడ అన్ని వయస్సుల  వాళ్లు కూడ ఉన్నారు. వీరిని పోలీసులు  భద్రత మధ్య కొండపైకి పంపారు.  నీలక్కల్ వద్ద ఇద్దరు మహిళలను నిరసనకారులు అడ్డుకొన్నారు.  కానీ, పోలీసులు వారిని నిరసనకారుల నుండి రక్షించి కొండపైకి పంపారు.

పతనంతిట్ట బస్టాండ్ వద్ద మరో మహిళను కూడ నిరసనకారులు అడ్డుకొన్నారు. ఏపీకి చెందిన మాధవి అనే  అయ్యప్ప భక్తురాలు గుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా ఉండేందుకు సంప్రదాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నీలక్కల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 

సంబంధిత వార్తలు

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్