కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశానికి అనుమతి ఇస్తూ.. సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలసిందే. కాగా... సుప్రీం ఇచ్చిన తీర్పును కర్ణాటక మహిళా మంత్రి జయమాల స్వాగతించారు.రాజ్యాంగంలో మహిళలకు, పురుషులకు బేధం చూపించరని అన్నారు. ఇక్కడ ఆలయాలు కేవలం పురుషులకే, కేవలం మహిళలకే అని పేర్కొనడం సరికాదన్నారు.

మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధం విధించడం సరికాదని, శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.
read more news

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

శబరిమలలోకి మహిళలు.. హిందూ సంఘాల ఆందోళన

‘‘మహిళలను చూడటం అయ్యప్పకు ఇష్టముండదు’’
ఇప్పుడు ఆ పార్వతి శబరిమల ఆలయంలోకి వెళ్లొచ్చు