Asianet News TeluguAsianet News Telugu

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో కేరళ అట్టుడుకుతోంది.  ఆలయ ప్రవేశం చేస్తామని హేతువాద మహిళలు.. అడుగుపెడితే రెండుగా చీలుస్తామంటూ సాంప్రదాయ మహిళలు సవాల్‌ విసురుకోవడంతో పాటు గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

Sabarimala Temple Entry women standing at neelakkal
Author
Sabarimala, First Published Oct 16, 2018, 10:38 AM IST

అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో కేరళ అట్టుడుకుతోంది.  ఆలయ ప్రవేశం చేస్తామని హేతువాద మహిళలు.. అడుగుపెడితే రెండుగా చీలుస్తామంటూ సాంప్రదాయ మహిళలు సవాల్‌ విసురుకోవడంతో పాటు గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సమీక్షకు వెళ్లాలంటూ ప్రజలు రోడ్ల మీదకువస్తున్నారు. మరోవైపు వార్షిక నెలవారి పూజల సందర్భంగా బుధవారం ఆలయాన్ని తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు సిద్ధమయ్యారు.. దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కాళ్లు విరగ్గొడతామని కొందరు మహిళలు ఇప్పటికే హెచ్చరించగా.. శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన, భారతీయ ధర్మ జనసేన, శబరిమల భక్త సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.

పంబకు సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని పార్కింగ్ ప్రాంతంగా ఉండే నీలక్కల్‌కు ఇప్పటికే వేలాది మంది మహిళలు చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఒక్క మహిళను కూడా శబరిమల వైపు వెళ్లనివ్వమని వారు చెబుతున్నారు.

ఎవరైనా ఇటుగా వస్తే అడ్డంగా  పడుకుంటామని.. అప్పటికీ వెనుదిరగకుండా ప్రయత్నిస్తే.. రెండుగా చీలుస్తామని హెచ్చరిస్తున్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

మరోవైపు ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ కీలక సమావేశం నిర్వహించనుంది.. అలాగే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళా భక్తులకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం లేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
 
 

Follow Us:
Download App:
  • android
  • ios