అన్ని వయసుల మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ అట్టుడుకుతోంది. సుప్రీం తీర్పుపై ప్రగతీశీల శక్తులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. సాంప్రదాయవాదులు మాత్రం మండిపడుతున్నారు.
అన్ని వయసుల మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ అట్టుడుకుతోంది. సుప్రీం తీర్పుపై ప్రగతీశీల శక్తులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. సాంప్రదాయవాదులు మాత్రం మండిపడుతున్నారు.
ముఖ్యంగా మహిళలే అత్యున్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ.. ‘‘ రెడీ టూ వెయిట్ ’’ అంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. తమిళనాడుకు చెందిన కొంతమంది హిందూ మహిళలైతే తాము 50 ఏళ్ల తర్వాతే అయ్యప్ప ఆలయంలోకి వెళ్తామని.. న్యాయస్థానం తీర్పుల కన్నా సనాతన ధర్మానికి, సాంప్రదాయాలకే తాము కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.
మరోవైపు కేరళలోని పందలంలో ఉన్న అయ్యప్ప ధర్మ సంరక్షణ సమితి సైతం సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టనున్నామని తెలిపింది. అయ్యప్ప స్వామి కంటే ఎవరూ గొప్పకాదంటూ.. స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదాలు చేస్తూ కేరళలోని వివిధ ప్రాంతాల్లో.. రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు.
అయ్యప్ప మంత్రాన్ని పఠిస్తూ.. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా కిల్లిపాలెం రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో ఇడుక్కికి చెందిన అంబిలి అనే మహిళా కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇతర కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రతి ఏటా మకరవిలక్కులో భాగంగా జరిగే ‘‘ తిరువాభరణం’’ కార్యక్రమానికి అయ్యప్ప ఆభరణాలను అందివ్వమని పండాలం ప్యాలెస్ నిర్వాహక సంఘం హెచ్చరించింది. దీనితో పాటు సుప్రీం తీర్పును వ్యతిరేకించే వారి నుంచి సంతకాలు సేకరిస్తున్నారు ఉద్యమకారులు.
శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విశ్వాసాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలు వివక్షకు గురవుతున్నారని.. పురుషుల్లాగే మహిళలకు కూడా ఆలయంలోకి వెళ్లి పూజలు చేసుకునే హక్కుందని పేర్కొంది.
మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి
