న్యూఢిల్లీ: కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో  మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.4-1తేడాతో వెల్లడించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

పురుషులతో పోలిస్తే  మహిళలు ఎందులోనూ తక్కువ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టాలు, సమాజం అందరిని గౌరవించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.  ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో  నలుగురు న్యాయమూర్తులు మహిళల ప్రవేశానికి సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి ఓ న్యాయమూర్తి మాత్రం  మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించారు.

ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో 4-1తేడాతో ఈ తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం నాడు వెలువరించింది.శబరిమల ఆలయంలోకి  మహిళలను ప్రవేశించకూడదని ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది.
మహిళలపై విపక్ష చూపడం సరైందికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఆలయాల్లో లింగవివక్ష తావు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎందులో కూడ తక్కు వ కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళలను ఆలయాల్లోకి రాకుండా నిషేధించడమనేది  హిందూమత స్వేచ్ఛకు భంగమని సుప్రీంకోర్టు  అభిప్రాయపడింది.

చట్టం, సమాజాన్ని రెండింటిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ వైపు దేవతలను పూజిస్తూనే మరోవైపు మహిళలను సమదృష్టితో చూడకపోవడం సరైంది కాదని  కోర్టు అభిప్రాయపడింది.మతమనేది ప్రాథమిక జీవన విధానంలో భాగంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

యంగ్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  ఇరువర్గాలు తమ తమ వాదనలను విన్పించారు.

2018 ఆగష్టు 1వ తేది నాటికి  ఈ విషయమై  ఇరువర్గాల వాదనలు ముగిశాయి. అయితే  ఈ విషయమై కోర్టు మాత్రం తీర్పును  రిజర్వ్ చేసింది. శుక్రవారం నాడు సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు  సుప్రీంకోర్టు సంచలన తీర్పును  వెలువరించింది.

సంబంధిత వార్తలు

శబరిమలలోకి మహిళలు.. హిందూ సంఘాల ఆందోళన

‘‘మహిళలను చూడటం అయ్యప్పకు ఇష్టముండదు’’
ఇప్పుడు ఆ పార్వతి శబరిమల ఆలయంలోకి వెళ్లొచ్చు