తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ఏపీకి చెందిన మహిళ మాధవి కుటుంబం  బుధవారం నాడు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే నిరసనకారుల నుండి పోలీసుల రక్షణతో శబరిమల కొండపైకి  కొంత దూరం వెళ్లింది. ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినా  నిరసనకారులు అడ్డుకోవడంతో  వెనుదిరిగారు.

శబరిమల ఆలయంలోకి మహిళలను  అనుమతిస్తూ  సుప్రీంకోర్టు  ధర్మాసనం ఇటీవలనే తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటించింది.

 ఈ మేరకు  ఏపీ నుండి 40 ఏళ్ల మాధవి కుటుంబం అయ్యప్పను దర్శించుకొనేందుకు  బుధవారం నాడు  శబరిమలకు వచ్చారు. పోలీసులు వారిని నిరసనకారుల నుండి రక్షిస్తూ కొండపైకి పంపారు.

 

అయితే ఆలయం వరకు వెళ్లకుండానే నిరసనకారుల తీవ్ర నిరసనల మధ్య మాధవి కుటుంబం తిరుగు ప్రయాణమైంది. ఆలయం సమీపంలోకి తాము చేరుకోగానే పోలీసులు తమను వదిలేశారని మాధవి చెబుతున్నారు. 

నిరసనకారులు తమను ఆలయం వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడంతో  తాము  వెనుదిరిగినట్టు చెప్పారు. ఆలయం వరకు పోలీసులు రక్షణ లేదన్నారు. నిరసనకారుల హోరుతో తమ పిల్లలు భయపడ్డారని  మాధవి చెప్పారు. దీంతో  వెనక్కి వచ్చామన్నారు. 

 

 

 

 

సంబంధిత వార్తలు

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్