ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను కొనసాగిస్తేనే మంచిదని ట్రావెన్‌కోర్‌ బోర్డు కోర్టుకు చెప్పినట్లు పద్మకుమార్‌ తెలిపారు. అయితే ఇప్పుడు తమకు మరో అవకాశం లేదని, న్యాయస్థానం తీర్పును అమలు చేస్తామన్నారు. 

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలల ప్రవేశానికి అనుమతి ఇస్తూ.. సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరిచింది. కాగా.. ఈ తీర్పుపై శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరావు రాజీవరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ తీర్పుపై ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వయసుల మహిళలకు శబరిమలలో ప్రవేశం కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంతృప్తిగా లేదని, అయితే తీర్పును తాము అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

తీర్పుపై ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు అధ్యక్షుడు ఎ. పద్మకుమార్‌ కూడా స్పందించారు. కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను కొనసాగిస్తేనే మంచిదని ట్రావెన్‌కోర్‌ బోర్డు కోర్టుకు చెప్పినట్లు పద్మకుమార్‌ తెలిపారు. అయితే ఇప్పుడు తమకు మరో అవకాశం లేదని, న్యాయస్థానం తీర్పును అమలు చేస్తామన్నారు. అయ్యప్ప ధర్మ సేన అధ్యక్షుడు రాహుల్‌ ఈశ్వర్‌ మాట్లాడుతూ.. తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్తామని చెప్పారు.

దశాబ్దాల కాలంగా శబరిమలలోకి మహిళల ప్రవేశం లేదన్న సంగతి తెలిసిందే. మహిళల నెలసరి సమస్యలను కారణంగా చూపుతూ.. వారి ప్రవేశంపై నిషేధం ప్రకటించారు. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధం విధించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.