శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్న ఆందోళనకారులపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరసనలో పాల్గొన్న సుమారు 3,345 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా వీరిపై 517 కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 26 నుంచి ఈ అరెస్టులు, కేసుల నమోదు ఎపిసోడ్‌ మొదలైంది. శబరిమల తాంత్రి కుటుంబసభ్యుడు, కార్యకర్త రాహుల్ ఈశ్వర్‌ను ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు.. కొచ్చి తీసుకెళ్లారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినందుకు గాను రాహుల్ ఈశ్వర్‌పై నమోదైన ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు.

అయ్యప్ప ఆలయం ఉన్న పథనాంతిట్ట జిల్లాలోనే కేవలం 12 గంటల్లో 500 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 122 మందిని రిమాండ్‌కు పంపగా.. మిగిలిన వారిని బెయిల్‌పై విడుదల చేశారు.

ఈ అరెస్టులపై కేరళ డీజీపీ స్పందిస్తూ.. అ్ని వయస్సుల వారిని ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిన వారినే అదుపులోకి తీసుకున్నామని.. స్వామి కీర్తనలు, ప్రార్థనలకే పరిమితమైన వారి జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు.

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమలలో మహిళల ప్రవేశం.. రివ్యూ పిటిషన్‌పై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల.. ఐదుగురు తెలంగాణ మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు