అన్ని వయసుల మహిళలను శబరిమలలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ల‌పై సుప్రీం విచారణకు అంగీకరించింది. మహిళల అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన మొత్తం 19 పిటిషన్లపైనా... నవంబర్ 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు.

ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరిపి నిర్ణయాన్ని తెలుపుతామని సీజేఐ స్పష్టం చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళా భక్తులను పలువురు భక్తులు అడ్డుకున్నారు.

నెలవారీ పూజల కోసం బుధవారం తెరచుకున్న అయ్యప్ప ఆలయం వద్ద ఆరు రోజుల పాటు కేరళలో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నిషేధిత వయసున్న మహిళలను ఆలయం వరకూ మాత్రమే చేర్చగలిగిన పోలీసులు, వారిని పదునెట్టాంబడి మాత్రం ఎక్కించలేకపోయారు.

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల.. ఐదుగురు తెలంగాణ మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

శబరిమలలో ఉద్రిక్తతే: న్యూయార్క్ టైమ్స్ లేడీ జర్నలిస్టుపై దాడి

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత