Asianet News TeluguAsianet News Telugu

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

కేరళలో శబరిమల అంశంపై ప్రస్తుతం దేశమంతటా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.ఈ విషయంపై మొదటిసారి రజినీకాంత్ స్పందించారు

rajinikanth about shabarimala issue
Author
Hyderabad, First Published Oct 21, 2018, 1:38 PM IST

కేరళలో శబరిమల అంశంపై ప్రస్తుతం దేశమంతటా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఇటీవల శబరిమలకు ఏ వయసులో ఉన్న మహిళలైన వెళ్లవచ్చని తీర్పుని ఇవ్వగా కేరళ ప్రభుత్వం కూడా అదే తరహాలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనున్నట్లు వివరణ ఇచ్చింది. 

దీంతో శబరిమలలో అయ్యప్ప భక్తులు కోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మొదటిసారి రజినీకాంత్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు సమన హక్కులు ఇవ్వడంలో ఎలాంటి పరిధులు ఉండకూడదు. అయితే ఆలయం విషయానికి వస్తే.. ప్రతి దానికి ఒక్కో తరహాలో విశ్వాసం అలాగే సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాలు ఇవి. నా విన్నపం ఏమిటంటే ఇటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకూడదని రజినీకాంత్ తెలిపారు. 

ఇక కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రజినీ నెమ్మదిగా సమాధానమిచ్చారు. మతం ఆచారాల విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది . కోర్టు తీర్పు అలక్ష్యం చేయమని చెప్పడం లేదు. అలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రజినీకాంత్ తన వివరణ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios