శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై బీఎస్ఎన్ఎల్ వేటు వేసింది. ఆమెను మరో ప్రాంతానికి బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

బీఎస్‌ఎన్ఎల్‌ ఉద్యోగిగా కొచ్చిలోని బోట్ జెట్టి బ్రాంచ్‌‌లో టెలికామ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోన్న ఫాతిమా.. హక్కుల కార్యకర్తగానూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో అన్ని వయస్సుల మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుపై ఫాతిమా హర్షం వ్యక్తం చేసింది. అయ్యప్ప మాల ధరించి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రత మధ్య మరో మహిళతో కలిసి.. శబరిమల ప్రధాన ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. అయితే అయ్యప్ప భక్తులు, సాంప్రదాయవాదులు రెహానాను అడ్డుకున్నారు.

ఫాతిమా చర్యపై ముస్లిం మతపెద్దలు మండిపడ్డారు.. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినందుకు రెహానా ఫాతిమాతో పాటు ఆమె కుటుంబాన్ని ముస్లిం సమాజం నుంచి బహిష్కరించింది. తాజాగా ఫాతిమా చర్యను తప్పబట్టిన బీఎస్ఎస్ఎన్ ఉన్నతాధికారులు ఆమెను పాలారివొట్టం టెలిఫోన్ ఎక్చేంజ్‌కు బదిలీచేశారు. 

అయ్యప్ప ఆలయంలోకి ముస్లిం మహిళ... మతం నుంచి బహిష్కరణ

శబరిమలలో మహిళల ప్రవేశం.. రివ్యూ పిటిషన్‌పై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల.. ఐదుగురు తెలంగాణ మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల: సుప్రీం తీర్పుపై అఫిడవిట్‌కు ట్రావెన్ కోర్ బోర్డు నిర్ణయం

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

శబరిమలలో ఉద్రిక్తతే: న్యూయార్క్ టైమ్స్ లేడీ జర్నలిస్టుపై దాడి

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ