Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. రైలు ఎక్కిస్తాన‌ని న‌మ్మించి మైన‌ర్ పై అత్యాచారం.. ఇద్దరు అరెస్టు..

దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని తిలక్ బ్రిడ్జీ సమీపంలో ఓ మైనర్ పై ఇద్దరు దుండగులు అత్యాచారాని ఒడిగట్టారు. 

Rape of a minor by believing that he will board the train.. Two arrested..
Author
New Delhi, First Published Aug 9, 2022, 9:07 AM IST

రైలు ఎక్కిస్తాన‌ని మాయ‌మాట‌లు చెప్పి ఓ మైన‌ర్ ను ఎవ‌రూ లేని ప్ర‌దేశానికి తీసుకెళ్లి ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సోమవారం తెల్లవారుజామున తిలక్ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌ల వెంబడి ఉన్న పొదల్లో ఈ ఘటన జరిగింది. 

వీడి దుంప తెగ.. రాజకీయనాయకుడికి కోపం వచ్చి 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేశాడు..

గుజరాత్‌కు చెందిన మైన‌ర్ త‌న స్నేహితుడైన దీపక్‌తో కలసి రైల్వే స్టేష‌న్ కు వ‌చ్చింది. అక్క‌డ అత‌డితో గొడ‌వ జరిగింది. దీంతో అత‌డు ఆమెను విడిచిపెట్టి వెళ్లాడు. అదే స‌మ‌యంలో అక్క‌డ ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల ద‌గ్గ‌రికి బాలిక వెళ్లింది. త‌న ఇంటికి కాల్ చేస్తాన‌ని, ఫోన్ ఇవ్వాల‌ని కోరింది. వారు బాలిక‌ను మాట‌ల్లో పెట్టారు. రైలును ప‌ట్టుకోవ‌డానికి బాలిక‌కు స‌హాయం చేస్తామ‌ని చెప్పారు. అయితే రైలు వేరే స్టేష‌న్ నుంచి అందుబాటులో ఉంటుందని అక్క‌డికి వెళ్లాల్సి ఉంటుంద‌ని న‌మ్మించారు.
Mahatma Gandhi Statue: నోయిడాలో వినూత్న ప్ర‌చారం.. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మహాత్ముడి విగ్రహం

ఆ బాలిక‌ను నిందితులు బ‌య‌టకు తీసుకొచ్చి తిలక్ బ్రిడ్జ్ సమీపంలోని ట్రాక్ స‌మీపంలోకి తీసుకెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆమెపై ఇద్ద‌రూ అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ‘‘ బాలిక, ఆమె స్నేహితుడు ఆదివారం ఢిల్లీకి వచ్చారు. వారు రాత్రి 9.40 గంటలకు జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కాల్సి ఉంది. కానీ అది మిస్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో వారి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో ఆ స్నేహితుడు ఆమెను స్టేషన్‌లోనే విడిచిపెట్టాడు. ఆ స‌మ‌యంలోనే నిందితులు ఆమెను క‌లిశారు.’’ అని పోలీసులు తెలిపారు.

UGC NET సెకండ్ ఫేజ్ పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

నిందితులను ఫరీదాబాద్‌కు చెందిన హర్దీప్ నగర్ (21), ఆగ్రాకు చెందిన రాహుల్ (20)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వాటర్ బాటిళ్లను విక్రయిస్తుంటారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత బాలిక కోరిక మేర‌కు నిందితులు సోమ‌వారం తెల్ల‌వారుజామున ఆమెను అజ్మీరీ గేట్ వైపున‌కు తీసుకొచ్చారు. ఇదే స‌మ‌యంలో ఆమె స్నేహితుడు దీపక్ కూడా అక్క‌డికి చేరుకున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో హర్దీప్, రాహుల్ దీపక్ ను తిట్టారు. బాలికను ఎందుకు విడిచిపెట్టావ‌ని గొడ‌వ చేశారు. దీంతో వారి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

UP minister Rakesh Sachan: 31 ఏళ్ల నాటి కేసులో యూపీ మంత్రికి జైలు శిక్ష.. అంత‌లోనే బెయిల్

ఈ గొడ‌వ‌ను అక్క‌డికి వ‌చ్చిన పెట్రోలింగ్ సిబ్బంది గ‌మ‌నించారు. వారి వ‌ద్ద‌కు చేరుకొని ఏం జ‌రిగింద‌ని విచారించారు. అనంత‌రం వారంద‌రినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్క‌డ ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపి నిందితులను, మైనర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిట‌ల్ కు పంపించారు. ఘటనాస్థలం నుంచి ఫోరెన్సిక్ బృందం నమూనాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తోంది. నిందితులు ఇద్ద‌రినీ అరెస్టు చేసి, వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376డి (గ్యాంగ్ రేప్) కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వే) హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios