Asianet News TeluguAsianet News Telugu

Mahatma Gandhi Statue:  నోయిడాలో వినూత్న ప్ర‌చారం..  ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మహాత్ముడి విగ్రహం

Mahatma Gandhi Statue: జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రంతో పాటు స్వచ్ఛభారత్ మిషన్‌పైనా ప్రజల్లో అవగాహన కల్పించాల‌నే ఉద్దేశ్యంతో ఉత్తర‌ప్రదేశ్‌లోని నోయిడాలో సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి.. వాటిని రీసైకిల్ చేసి.. మ‌హ్మ‌తుడి విగ్ర‌హాన్ని తయారు చేశారు. 

Mahatma Gandhi Statue 20 Feet High Mahatma Gandhi Statue Made From 1,000 Kg Waste Unveiled in Noida
Author
Hyderabad, First Published Aug 9, 2022, 6:10 AM IST

Mahatma Gandhi Statue: 21వ శతాబ్దంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్ర‌భుత్వాలు, స్వ‌చ్చంద సంస్థ‌లు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నగరపాలక సంస్థ ఓ విన్నూత ప్ర‌చారానికి శ్రీ కారం చుట్టింది. స్వాతంత్ర పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీ కృషిని, స్వచ్ఛభారత్ మిషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని భావించింది. ఈ నేప‌థ్యంతో యూపీలోని నోయిడాలో క్విట్‌ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల, ఆరు అడుగుల వెడ‌ల్పు గ‌ల‌ మార్చింగ్‌ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించింది.

అయితే.. అందులో ఏం ప్ర‌త్యేక‌త ఉంద‌ని అనుకుంటున్నారా.? ఆ విగ్రహాన్ని రీసైకిల్‌ చేసిన‌ ప‍్లాస్టిక్‌ వ్యర్థాలతో ఈ విగ్ర‌హాన్ని రూపొందించారు. ఈ విగ్ర‌హా రూప‌క‌ల్ప‌న‌లో హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యం అందించింది. సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి.. వాటిని రీసైకిల్ చేసి.. మ‌హ్మ‌తుడి విగ్ర‌హాన్ని తయారు చేశారు. ప్ర‌స్తుతం ఈ విగ్రహాన్ని నోయిడాలోని సెక్టార్‌ 137లో ఏర్పాటు చేశారు. 

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్ర‌జ‌ల‌కు గుర్తు చేసేలా మహాత్మ గాంధీ విగ్రహాన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జూలై 1 నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే.. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల కలను నెరవేర్చే లక్ష్యంతో.. న‌గ‌రంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించే విషయాన్నిసామాన్యులకు ఈ విధంగా గుర్తు చేయాల‌ని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు నోయిడా అథారిటీ అధికారులు తెలిపారు.

పర్యావరణానికి కలిగే హాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను  జులై 1 నుంచి పూర్తిగా నిషేధించిన విష‌యం తెలిసిందే. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రచారంలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని తెలిపారు. ఈ విగ్రహా నిర్మాణంతో పాటు ఆపరేషన్ ప్లాస్టిక్ ఎక్స్ఛేంజ్ మొబైల్ వ్యాన్ కూడా ప్రారంభించినట్టు తెలిపారు.  ఈ క్యాంపెయిన్ కింద ఇప్పటి వరకు 170 మంది 816 కిలోల ప్లాస్టిక్ బాటిళ్లు, 52 కిలోల పాలిథిన్ స్థానంలో గుడ్డ సంచులు, చెక్క స్టాక్ రేట్లు, స్టీల్ బాటిళ్లను అందించారు. మరోవైపు.. రాజస్థాన్‌లో ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొస్తే.. లీటర్‌ పెట్రోల్‌పై డిస్కౌంట్‌ ఇస్తున్నారు ఓ పెట్రోల్‌ పంపు యజమాని. 

నోయిడా అథారిటీ ఏర్పాటు చేసిన‌ మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌతమ్ బుద్ నగర్ ఎంపీ మహేష్ శర్మ, నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్, నోయిడా అథారిటీ సీఈవో రీతూ మహేశ్వరి, దాద్రీ ఎమ్మెల్యే తేజ్‌పాల్ నగర్, ఇతర నోయిడా అథారిటీ అధికారులతో సహా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios