Asianet News TeluguAsianet News Telugu

UGC NET సెకండ్ ఫేజ్ పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

UGC-NET phase 2 postponed: యూజీసీ-నెట్ సెకండ్ ఫేజ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు నెలలో నిర్వహిస్తామని యూజీసీ ఛైర్మన్ తెలిపారు.

UGC NET phase 2 postponed
Author
Hyderabad, First Published Aug 9, 2022, 5:03 AM IST

UGC-NET phase 2 postponed: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ఫేజ్ 2 పరీక్షలు వాయిదా ప‌డింది.  అంతకుముందు షెడ్యూల్ ప్రకారం.. UGC NET ఫేజ్ 2 పరీక్షలు ఆగస్టు 12 నుండి ఆగస్టు 14, 2022 వరకు జరగాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఈ పరీక్షల‌ను సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించ‌నున్నారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్‌ ఎం జగదీష్‌ కుమార్ ఓ ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nicలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాలని తెలిపారు.

పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 అభ్యర్థులందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో 100 మార్కులకు 50 ప్రశ్నలు అడుగుతారు. అదే సమయంలో, పేపర్-2 అభ్యర్థులు ఎంచుకున్న డొమైన్‌గా ఉంటుంది. ఇందులో 200 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లను పరిష్కరించడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం ఇవ్వబడుతుంది.

యూజీసీ-నెట్​ మొదటి ఫేజ్​ పరీక్షలను నేషనల్​ టెస్టింగ్​ ఏజన్సీ(NTA ).. జులై 8, 9, 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా 225 నగరాల్లో నిర్వహించింది. ఈ క్ర‌మంలో జూలై 7 న అడ్మిట్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు తదుపరి దశ పరీక్షను ఆగస్టు 12, 13,14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించబడుతుంది. అదే సమయంలో, అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం మాత్రమే NTA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

UGC NET అడ్మిట్ కార్డ్ 2022 ఫేజ్ 2ని డౌన్‌లోడ్ చేసుకోండిలా..  

>> UGC NET అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in.ను సందర్శించండి – 

>> హోమ్ పేజీ దిగువన ఉన్న “Candidates activities” విభాగంలో అందుబాటులో ఉన్న UGC NET అడ్మిట్ కార్డ్ లింక్‌ను ఎంచుకోండి.

>>  UGC NET అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ,  సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి. 

>> సైన్ ఇన్ బటన్‌ను ఎంచుకోండి.

>> UGC NET అడ్మిట్ కార్డ్ 2022 మీ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.

>> మీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

>> తదుపరి ఉపయోగం కోసం UGC NET 2022 హాల్ టికెట్ ప్రింటవుట్‌ను ఆప్ఫ‌న్ నొక్కండి.

Follow Us:
Download App:
  • android
  • ios