నచ్చిన అమ్మాయిని మీరు కిడ్నాప్ చేస్తారా.. నన్ను చేయమంటారా

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 5, Sep 2018, 7:25 AM IST
ram kadam sensational comments against women
Highlights

మహారాష్ట్రలోని ఘట్కోపర్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ కడామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అమ్మాయి నచ్చితే ప్రపోజ్ చేయాలని.. ఒక వేళ ఆ అమ్మాయి తిరస్కరిస్తే కిడ్నాప్ చేయాలంటూ వ్యాఖ్యానించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి

మహారాష్ట్రలోని ఘట్కోపర్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ కడామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అమ్మాయి నచ్చితే ప్రపోజ్ చేయాలని.. ఒక వేళ ఆ అమ్మాయి తిరస్కరిస్తే కిడ్నాప్ చేయాలంటూ వ్యాఖ్యానించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన ‘దహా హండీ’ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ... ‘‘అబ్బాయిలందరు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయండి.. వాళ్లు తిరస్కరిస్తే.. కిడ్నాప్ చేయండి. లేదంటే నాకు చెప్పండి నేనే కిడ్నాప్ చేసి వాళ్లను అప్పగిస్తాను..నా ఫోన్ నెంబర్ రాసుకోండి.. మీరు ఫోన్ చేసి ‘‘ నేను ఆపదలో ఉన్నాను... ఓ అమ్మాయిని ప్రేమించానను.. కానీ ఒప్పుకోవడం లేదని ఒక్క మాట చెబితే చాలు.. మీ తల్లిదండ్రులతో మాట్లాడి నేను ఆమెను ఎత్తుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను.. ఎలాంటి సమయంలోనైనా అండగా ఉంటాను అని వ్యాఖ్యానించారు.

ఈ వీడియోను ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన  ప్రజాప్రతినిధులే ఇలా మాట్లాడితే మహిళలకు రక్షణ ఎక్కడుంటుంది...? అంటూ జితేంద్ర ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు వేదికపై ఉండగానే రామ్ కడామ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

loader