Asianet News TeluguAsianet News Telugu

‘‘మా ఇంటి దగ్గర ఏలియన్ కనిపించింది’’

మా ఇంటి ముందు ఏలియన్ కనిపించిందంటూ.. పూణెకి చెందిన ఓ వ్యక్తి అంటున్నారు. అనడమే కాదు.. తాను ఏలియన్ చూశానంటూ ఆయన ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. 

Pune man 'spots' alien object outside his window, writes to PMO
Author
Hyderabad, First Published Dec 28, 2018, 3:13 PM IST


మా ఇంటి ముందు ఏలియన్ కనిపించిందంటూ.. పూణెకి చెందిన ఓ వ్యక్తి అంటున్నారు. అనడమే కాదు.. తాను ఏలియన్ చూశానంటూ ఆయన ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. దీంతో.. ఆ లేఖను పరిశీలించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. వెంటనే దానిని మహారాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు పంపించింది. దీనిపై విచారణ పట్టిన పోలీసులు కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి.

ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు కొద్దిరోజుల క్రితం గుర్తించారు. అయితే.. ఆ వ్యక్తి మానసిక పరిస్థతి సరిగా లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.  రెండు నెలల క్రితం ఆ వ్యక్తి ఇంటి ముందు ఉన్న చెట్టులో నుంచి ఓ వెలుగు కనపడిందట. ఆ వెలుగుని చూసి ఏలియన్ వచ్చిందని అతను భావించి.. వెంటనే పీఎంవోకి లేఖ రాశారు.

అతను అలా పీఎంవోకి లేఖ రాసిన విషయం కనీసం అతని కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు చేపట్టే సరికి ఈ సంఘటన అందరికీ తెలిసి వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios