భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అన్ని ప్రాంతాలలో ఆరోగ్య సేవలు, అత్యవసర ప్రతిస్పందనలు అంతరాయం లేకుండా కొనసాగేలా చూస్తోంది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: India Pakistan war: సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు
Telugu news live updates: India Pakistan war: సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
India Pakistan war: సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు
India Pakistan War: పాక్ రక్షణ మంత్రి పిచ్చి మాటలు.. ఇండియా ఒంటరిగా మారిందంటూ
పాకిస్తాన్ రక్షణా మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, ఇండియా ఒంటరిగా ఉందని, ఇజ్రాయెల్‌తో కలిసి ఇస్లాంకి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. పాకిస్తాన్‌కి చాలా దేశాల మద్దతు ఉందని చెప్పుకున్నారు.
పూర్తి కథనం చదవండిIndia Pakistan War: భయం వద్దు.. దేశంలో వాటి కొరత లేదు.. భరోసా ఇచ్చిన కేంద్రం
భారతపాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య నిత్యావసరాల ధరల పెరగకుండా.. వాటి నిల్వలను సమీక్షించాలని.. బ్లాక్ మార్కెట్, దళారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. భారత–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
India Pakistan War: బరితెగించిన పాకిస్థాన్.. ఎయిర్‌పోర్ట్, స్కూళ్లు, ఇళ్లపై డ్రోన్ దాడులు
పాకిస్థాన్ బరితెగిస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు నిర్వహిస్తే. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ సామాన్యులపై దాడికి దిగుతోంది. వరుసగా రెండో రోజు పాకిస్థాన్ దాడులకు దిగింది. తాజాగా శుక్రవారం రాత్రి మరోసారి డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది.
India Pakistan War: పాకిస్థాన్ డ్రోన్ దాడులు.. జమ్ములో టెన్షన్, టెన్షన్
జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపోరా ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు వినిపించాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో అలర్ట్ సైరన్లు మోగించారు. పెద్ద ఎత్తున విద్యుత్ నిలిచిపోయింది.
India Pakistan War : దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలు మూసివేత... ఎప్పటివరకో తెలుసా?
భారత్ పై దాడికి పాక్ సైన్యం 400 డ్రోన్‌లను మోహరించగా భారత సైన్యం వాటిని కూల్చివేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా 24 విమానాశ్రయాలను మూసివేసారు. ఈ ఎయిర్ పోర్ట్స్ ఏవి? ఎన్నిరోజులు మూసేస్తారు? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIndia Pakistan War: మళ్లీ దాడులు మొదలు పెట్టిన పాక్.. ఆ ప్రాంతాల్లో బ్లాకవుట్
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వెంట పాకిస్థాన్ తరఫు నుంచి డ్రోన్లు భారత భూభాగంలోకి చొచ్చుకువస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజా దాడులతో పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
India Pakistan War : ఆపరేషన్ సిందూర్ కు పాక్ యువత మద్దతు
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సరైనదే అని ఆ దేశ యువతే ఒప్పుకుంటోంది. ముందుకు పాక్ దాడి మొదలుపెట్టింది... ఇప్పుడు ఇండియా దాడి చేస్తే శాంతి కావాలంటే ఎలా? 26 మంది చనిపోయినప్పుడు శాంతి ఎక్కడ ఉంది? అని ఓ పాక్ యువకుడు ప్రశ్నించాడు.
పూర్తి కథనం చదవండిHoroscope: ఈ రాశి వారికి ఇంట శుభకార్యాలు..వారికి మాత్రం బంధువులతో వివాదాలు
ఇంట శుభకార్యాలు, కొత్త అవకాశాలు కొన్ని రాశులకు లభించనున్నాయి. మరికొందరికి బంధువులతో వివాదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
పూర్తి కథనం చదవండిPawan Kalyan: వృద్ధురాలి కాళ్లకు మొక్కి, కలిసి భోజనం చేసిన పవన్.. ఎందుకంటే
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వృద్ధురాలి ప్రేమకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. స్వయంగా భోజనం వడ్డించి, చీర, డబ్బులను అందించాడు ఏపీ డిప్యూటీ సీఎం. ఇంతకీ పవన్ ఈ పని చేయడం వెనకాల అసలు కారణంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Indian Army: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇండియన్ ఆర్మీకి మద్ధతుగా ప్రాదేశిక సైన్యం.
పాకిస్తాన్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో, భారతీయ సైన్యానికి మద్దతుగా ప్రాదేశిక సైన్యాన్ని మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్వచ్ఛంద సైనిక దళ సభ్యులు పౌర వృత్తుల్లో నిమగ్నమై, అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తారు.
పూర్తి కథనం చదవండిTelangana: ఇండియన్ ఆర్మీకి అండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
భారత్, పాకిస్థాన్‌ల మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. పాకిస్థాన్ దాడులను భారత ఆర్మీ ధీటుగా ఎదురుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అందాల పోటీలు చూసేందుకు ఎగబడుతోన్న జనాలు.. దెబ్బకు వెబ్‌సైట్ నిలిపివేసిన అధికారులు
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గురువారం నుంచే స్టేడియంలో రిహార్సల్స్ ఉత్సాహంగా సాగాయి. వివిధ దేశాల కంటెస్టెంట్లు అందమైన కాస్ట్యూమ్స్‌తో స్టేజ్‌పై తమ నడకలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
RTC Rules: బస్సులో కల్లు తీసుకెల్తే నేరమా.? ఆర్టీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి
నల్లగొండ జిల్లా నకిరేకల్ వద్ద ఓ మహిళ కల్లు బాటిళ్లను ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కట్టంగూరులో జరుగుతున్న ఓ వేడుక కోసం ఈ కల్లు తీసుకెళ్లాలనుకున్న ఆమెను బస్సు కండక్టర్, డ్రైవర్ అడ్డుకున్నారు. దీంతో బస్సులో కల్లు తీసుకెళ్లడం నేరమా అన్న చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Dawood Ibrahim: దావూద్ ఎక్కడ ఉన్నాడు.? భారత్, పాక్ ఉద్రిక్తలతో..
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన పలువురు ఉగ్రవాదులు, నేరస్థులు ఆ దేశాన్ని వీడి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి32 ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్న షారుఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్ దీవానా సీక్వెల్: వస్తున్న నివేదికల ప్రకారం, షారుఖ్ ఖాన్ 32 ఏళ్ల నాటి బ్లాక్ బస్టర్ దీవానా సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాతోనే షారుఖ్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేశారు.
పూర్తి కథనం చదవండిAndhra Pradesh: డిప్యూటీ కలెక్టర్ను తహసీల్దార్‌గా డీమోట్ చేయండి.. సుప్రీం సంచలన తీర్పు
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఏపీ డిప్యూటీ కలెక్టర్ను తహసీల్దార్‌గా డిగ్రేడ్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఒక డిప్యూటీ కలెక్టర్‌ను తహసీల్దార్ హోదాకు డీమోట్ చేయాలని . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Train Ticket: ట్రైన్ టికెట్ చిరిగిపోతే ప్రయాణం చేయొచ్చా? కొత్త టికెట్ కొనాలా? అధికారుల వివరణ ఇదే
Train Ticket: ఒకసారి టికెట్ కొనుగోలు చేసిన తర్వాత అది చిరిగిపోతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైందా? ఒకవేళ భవిష్యత్తులో ఇలా జరిగితే చిరిగిపోయిన టికెట్ చెల్లుబాటు అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిరాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు.. సివిల్ డిఫెన్స్ చట్టంలో 11వరూల్ వినియోగించాలని సూచన
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారతదేశం ప్రతీకార చర్యలు చేపట్టింది. దీంతో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు అత్యవసర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పూర్తి కథనం చదవండిOperation sindoor: పాక్ దాడులను భారత్ ఎలా తిప్పికొట్టింది.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్ మీట్
భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని చాటింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులు, కాల్పుల విరమణ ఉల్లంఘనలను విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలు ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో ఏం జరిగిందన్న వివరాలను భారత సైన్యం, వాయుసేన, నౌకాదళానికి సంబంధించిన అధికారులు మీడియాకు వివరించారు.