Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ కు మహిళ ఒత్తిడి: తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

పర్భానిలోని ఓ ఆస్పత్రిలో 38 ఏళ్ల సచిన మిట్కరీ పనిచేస్తున్నాడు. ఆమెతో పాటు ఓ మహిళ కూడా పనిచేస్తోంది. ఆ వ్యక్తి పర్భాని - విస్మాత్ రోడ్డులోని తన ఇంటి పైకప్పునకు వేలాడుతూ ఆదివారం అతను కనిపించాడు. 

Man Kills Himself, Note Says Woman Pestered Him For Sex
Author
Parbhani, First Published Oct 16, 2018, 8:02 AM IST

ముంబై: ఓ మహిళ సెక్స్ కోసం ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పదే పదే సెక్స్ కోసం ఆమె ఒత్తిడి పెట్టడంతో అతను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. మహారాష్ట్రంలో పర్భాని జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పర్భానిలోని ఓ ఆస్పత్రిలో 38 ఏళ్ల సచిన మిట్కరీ పనిచేస్తున్నాడు. ఆమెతో పాటు ఓ మహిళ కూడా పనిచేస్తోంది. ఆ వ్యక్తి పర్భాని - విస్మాత్ రోడ్డులోని తన ఇంటి పైకప్పునకు వేలాడుతూ ఆదివారం అతను కనిపించాడు. 

దాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మహిళ తనను వేధిస్తోందని, లైంగిక సంబంధం కోసం ఒత్తిడి పెడుతోందని ఆ నోట్ రాసి ఉంది.

తనకు పెళ్లయిందని తెలిసి కూడా మహిళ తనను వదిలిపెట్టలేదని, క్రిమినల్ కేసు పెడుతానని తనను బెదిరిస్తూ వచ్చిందని అతను ఆ నోట్ లో రాశాడు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios