అతనికి సంవత్సరం క్రితమే పెళ్లి నిశ్చయమైంది. కొంత కాలం క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది. మరికొద్ది రోజుల్లో వారి వివాహం జరగనుంది. సడెన్ గా ఏమైందో తెలీదు.. కాబోయే భార్య గొంతు కోసేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాలోని పొట్టంగి సమితిలోని చింతలగూడ గ్రామానికి చెందిన  సుస్మితా కి ఖోరాతో గ్రామానికి చెందిన విశ్వనాథ్ తో గతేడాది పెళ్లి కుదిరింది. కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు భావిస్తున్నారు.

Also Read నేరాల పుట్ట.. పోలీసుల ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం.....

నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి విశ్వనాథ్... అప్పుడప్పుడు వధువు  సుస్మిత ఇంటికి వస్తూ ఉండేవాడు. అదేవిధంగా రెండు రోజుల క్రితం కూడా కాబోయే అత్తారింటికి వచ్చాడు. అక్కడే భోజనం కూడా చేశాడు. కాసేపు కాబోయే వధూ, వరులు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తర్వాత అక్కడే విశ్వనాథ్ నిద్రకు ఉపక్రమించాడు.

అందరూ నిద్రపోతున్న సమయంలో సడెన్ గా విశ్వనాథ్ కత్తి తీసుకొని.. సుస్మిత గొంతు కోసం చంపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమె గొంతు కొద్దిగా తెగింది. రక్తస్రావం కావడంతో భయంతో సుస్మిత కేకలు పెట్టింది.ఆమె అరుపులకు ఇంట్లోవారంతా లేచారు. విషయం గమనించి విశ్వనాథ్ ని పట్టుకున్నారు. సుస్మితను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. తృటిలో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కాగా.. తమ కూతురిని చంపేందుకు ప్రయత్నించాడంటూ విశ్వనాథ్ పై సుస్మిత తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.