MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాఘవేంద్రరావు వల్ల ఆ రోజు టార్చర్‌.. కారులో వెళ్లిన బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని బయటపెట్టిన రాజమౌళి

రాఘవేంద్రరావు వల్ల ఆ రోజు టార్చర్‌.. కారులో వెళ్లిన బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని బయటపెట్టిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి.. రాఘవేంద్రరావు మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే రాఘవేంద్రరావు విషయంలో రాజమౌళికి ఓ బ్యాడ్‌ ఎక్స్ పీరియన్స్ కూడా ఉందట. తాజాగా అది బయటపెట్టాడు జక్కన్న. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 27 2024, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి ఎవరికి వారు దర్శక దిగ్గజాలు. ఒకప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు రాఘవేంద్రరావు. ఆయన సినిమాలు ఇప్పుడు వస్తే, ఏ పాన్‌ ఇండియా సరిపోదు, గ్లోబల్‌ ఫిల్మ్ లుగా ఆదరణ పొందేవి. వందల కోట్ల కలెక్షన్లని రాబట్టేవి. కానీ రాజమౌళి ఇప్పుడు అలాంటి అద్భుతాలు చేసి ఇండియన్‌ సినిమా రేంజ్‌ని పెంచాడు, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. మన భారతీయ సినిమా స్థాయిని పెంచే సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. 
 

27

రాఘవేంద్రరావుకి, రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీల మధ్య అనుబంధం, రిలేషన్‌ ఉంది. రాఘవేంద్రరావు వద్ద రాజమౌళి పనిచేశారు కూడా. యాడ్స్ చేశారు. టీవీ సీరియల్‌ కూడా డైరెక్ట్‌ చేశారు. రాజమౌళి వర్క్ నేర్చుకుందంటే రాఘవేంద్రరావు వద్దే అని చెప్పొచ్చు. 
 

37
photos-soundarya lahari

photos-soundarya lahari

అయితే ఆ సమయంలో ఓ సందర్భంలో రాఘవేంద్రరావు.. రాజమౌళిని టార్చర్‌ చేశారట. ఈ విషయాన్ని జక్కన్నే వెల్లడించారు. ఆ రోజుకు తనకు పెద్ద టార్చర్‌ అని చెప్పాడు. ఆయన కారులో కూర్చోవాలంటే భయమేసిందట. భయపడుతూనే కూర్చున్నాడట. ఆ సమయంలో చుక్కలు కనిపించాయని తెలిపారు రాజమౌళి. మరి ఇంతకి ఏం జరిగిందంటే..

47

ఓ రోజు రాఘవేంద్రరావు ఇంటికి వెళ్తే ఆయన వైట్‌ కారు, నిగనిగ మెరుస్తుందట. ఫ్రంట్‌ ప్యాసింజర్‌ సీట్‌ నీట్‌గా టర్కీ టవల్‌ వేసి ఉంటుందట, అది ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత వైట్‌గా ఉంటుందట. ఆ రోజు బయటకు వెళ్లాల్సి వచ్చింది. రా రాజమౌళి అని తనని పిలిచాడట రాఘవేంద్రరావు. డ్రైవర్‌ లేకపోవడంతో తనే డ్రైవ్‌ చేస్తున్నాడు. తాను ఎక్కడ కూర్చోవాలనేది పెద్ద ప్రశ్న.
 

57
photos-soundarya lahari

photos-soundarya lahari

తాను డర్టీగా ఉన్నాడట. ఫ్రంట్‌ సీట్‌లో కూర్చొంటే ఆ టవల్‌ మాసిపోతుందేమో అని బయపడ్డాడట. వెనకాల కూర్చుంటే రాఘవేంద్రావు డ్రైవ్‌ చేస్తుంటే తాను వెనకాల కూర్చుంటే బాగోదు అనిపించిందట. ఎట్టకేలకు ముందు సీట్లోనే కూర్చున్నాడట. కానీ సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని కూర్చోనట్టుగా భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడట. ఆ జర్నీ అయిపోయేంత వరకు చుక్కలు కనిపించాయని, అదొక పెద్ద నరకం అని బాంబ్‌ పేల్చాడు రాజమౌళి. 
 

67
photos-soundarya lahari

photos-soundarya lahari

రాఘవేంద్రరావు జర్నీని తెలియజేసేలా `సౌందర్యలహరి` టాక్‌ ని రన్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి రాజమౌళి, ప్రభాస్‌ గెస్ట్ లుగా వచ్చారు. ఆసమయంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు జక్కన్న. రాఘవేంద్రరావు ముందే ఈ విషయాన్ని చెప్పడం విశేషం. అయితే దీన్ని అందరు ఫన్నీగా తీసుకున్నారు. నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, ఎన్టీఆర్‌ సినిమాలు సంబంధించిన సీన్లపై చర్చించారు. `బాహుబలి` సమయంలో ఈ చర్చ నడిచింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది.
 

77

ఇక ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబుతో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంపై బిజీగా ఉన్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుందని తెలుస్తుంది. అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. మరోవైపు రాఘవేంద్రరావు దర్శకుడిగా సినిమాలు మానేసి టీవీ సీరియల్స్, ఓటీటీ ఫిల్మ్స్ ప్లాన్‌ చేస్తున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved