ఎన్సీపీ, సేన, కాంగ్రెస్‌ల మధ్య అధికార పంపకాలు ఇలా

మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే విధంగా మనకు కనపడుతుంది. శివసేన, కాంగ్రెస్,ఎన్సీపీలు ఒక్కటవ్వబోతున్నాయనేది నిన్నటి ప్రెస్ మీట్లను బట్టి మనకు అర్థమైపోతుంది

maharashtra government formation: shivsena, congress and ncp's power sharing

మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే విధంగా మనకు కనపడుతుంది. శివసేన, కాంగ్రెస్,ఎన్సీపీలు ఒక్కటవ్వబోతున్నాయనేది నిన్నటి ప్రెస్ మీట్లను బట్టి మనకు అర్థమైపోతుంది. అందుతున్న అంతర్గత సమాచారం మేరకు అధికార పంపకాలపై అందరూ ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది. 

శివసేనకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించనున్నట్టు తెలుస్తుంది. కాకపోతే రోటేషన్ పద్దతిలో ఆ పదవి తొలి రెండున్నర సంవత్సరాల తరువాత ఎన్సీపీ చేపట్టనున్నట్టు తెలుస్తుంది. పూర్తి 5 సంవత్సరాలపాటు ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ కు దక్కనుంది. ముఖ్యమైన స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ తొలి నుంచి పట్టుబడుతోంది కాబట్టి ఆ పోస్టును కాంగ్రెస్ కె ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. 

అన్నిటికంటే ముఖ్యమైన సిద్ధాంత పరమైన వైరుధ్యాన్ని ఎదుర్కొనేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ముందుకు తేనున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్రను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా నిర్మించనున్నామనే భావనను ముందుకు తీసుకురానున్నారు. 

Also Read:రాష్ట్రపతి పాలన: శరద్ పవార్ "మహా" గేమ్ ప్లాన్ ఇదీ..

రామ మందిరం విషయంలో అన్ని పార్టీలు ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయని, ఎవరు కూడా కోర్టు తీర్పును తప్పుబట్టలేదని అందరూ ఆహ్వానించారని వారు వారి వాదనగా ముందుకు తీసుకురాబోతున్నారు.

మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ చివరకు రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన  ఇప్పుడప్పడు తొలిగేదిలా కనపడడంలేదని భావించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేసారు. 

భగత్ సింగ్ కోషియారీ తీసుకున్న ఈ నిర్ణయం ఒకింత వివాదాస్పదమయ్యింది కూడా. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని,  తమకు బీజేపీకి కేటాయించినంత సమయం కేటాయించలేదని శివసేన సుప్రీమ్ కోర్ట్ తలుపుతట్టింది.

కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే, శరద్ పవార్ కి రాత్రి 8 గంటల వరకు సమయం ఉన్నా కూడా, ఉదయం 11.30 కు గవర్నర్ కు మరింత సమయం కావాలని ఒక లేఖ రాసారు. 

Also Read:President rule in Maharashtra:మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: కోవింద్ ఆమోదం

శరద్ పవార్ ఇలా లేఖ రాయడం ఏమిటని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ లేఖ వల్ల రిస్క్ అని తెలిసినా కూడా శరద్ పవార్ ప్రయోగించిన ఈ లేఖాస్త్రం సామర్థ్యమేంటో సాయంత్రానికి అందరికీ అర్థమైపోయింది. ఈ లోకః వల్ల శరద్ పవార్ ని రాజకీయ ధురంధరుడిగా అందరూ ఎందుకు పేర్కొంటారో మరోసారి నిరూపించుకున్నాడు. 

ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుండి మొదలు శరద్ పవార్ ఒక్కో చర్య అతని ఇమేజ్ ను అమాంతం పెంచేసాయి. తొలుత సిబిఐ కేసు విషయంలో నన్ను అరెస్ట్ చేయండి అని పోలీసుల దగ్గరికి వెళ్లడం, సతారా ప్రచార సభలో 79 ఏళ్ల వయసులో వర్షంలో నిలబడి చేసిన ప్రసంగం ఏకంగా శివాజీ వారసుడిని ఓడించగలిగింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios