Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రపతి పాలన: శరద్ పవార్ "మహా" గేమ్ ప్లాన్ ఇదీ..

ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ చదరంగా క్రీడకు రాష్ట్రపతిపాలన తాత్కాలిక బ్రేకులువేసినా, రాజకీయ చదర్ఫఅంగాన్ని నాకన్నా మెరుగ్గా ఎవరూ ఆడలేరంటూ ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న 79 సంవత్సరాల శరద్ పవార్ మనకు కనపడతారు. 

sharad pawar: the political accumen that's defining the shape of maha politics
Author
Mumbai, First Published Nov 13, 2019, 4:20 PM IST

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ చివరకు రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన  ఇప్పుడప్పడు తొలిగేదిలా కనపడడంలేదని భావించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేసారు. 

భగత్ సింగ్ కోషియారీ తీసుకున్న ఈ నిర్ణయం ఒకింత వివాదాస్పదమయ్యింది కూడా. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని,  తమకు బీజేపీకి కేటాయించినంత సమయం కేటాయించలేదని శివసేన సుప్రీమ్ కోర్ట్ తలుపుతట్టింది. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే, శరద్ పవార్ కి రాత్రి 8 గంటల వరకు సమయం ఉన్నా కూడా, ఉదయం 11.30 కు గవర్నర్ కు మరింత సమయం కావాలని ఒక లేఖ రాసారు. 

Also read: President rule in Maharashtra:మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: కోవింద్ ఆమోదం

శరద్ పవార్ ఇలా లేఖ రాయడం ఏమిటని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ లేఖ వల్ల రిస్క్ అని తెలిసినా కూడా శరద్ పవార్ ప్రయోగించిన ఈ లేఖాస్త్రం సామర్థ్యమేంటో సాయంత్రానికి అందరికీ అర్థమైపోయింది. ఈ లోకః వల్ల శరద్ పవార్ ని రాజకీయ ధురంధరుడిగా అందరూ ఎందుకు పేర్కొంటారో మరోసారి నిరూపించుకున్నాడు. 

ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుండి మొదలు శరద్ పవార్ ఒక్కో చర్య అతని ఇమేజ్ ను అమాంతం పెంచేసాయి. తొలుత సిబిఐ కేసు విషయంలో నన్ను అరెస్ట్ చేయండి అని పోలీసుల దగ్గరికి వెళ్లడం, సతారా ప్రచార సభలో 79 ఏళ్ల వయసులో వర్షంలో నిలబడి చేసిన ప్రసంగం ఏకంగా శివాజీ వారసుడిని ఓడించగలిగింది. 

నిన్నటి లేఖను గనుక తీసుకుంటే, గవర్నర్ కి మరికొంత సమయం కావాలని శరద్ పవార్ ఉదయమే లేఖ రాసారు. అప్పటివరకు ఢిల్లీ కి రమ్మని శరద్ పావారును పిలిచినా కాంగ్రెస్ పార్టీ హుటాహుటిన తన బృందాన్ని ముంబై కి పంపించింది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసాడు అని అనుకోవచ్చు. 

Also read: కాంగ్రెస్ తో శివసేన: ఈ నాటి ఈ 'మహా' బంధమేనాటిదో...

ఇలా కాంగ్రెస్ పార్టీని తొందరపెడుతూనే, శివసేనతో మాత్రం ఒకింత నిదానమే ప్రధానం అన్న విధంగా నడుచుకుంటున్నారు. ఠాక్రేల కుటుంబం పవార్ ల కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, వారిరువురు ఎప్పుడూ కలిసి రాజకీయాలు చేసింది లేదు. ఒక రకంగా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా శివ సేనతోని ఇక్కడ కలవవలిసి వస్తుంది. 

ఈ నేపథ్యంలో శివసేన తోని కలిసే ముందు తమ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు కూడా సమాధానం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ను రూపొందించమని ఇప్పటికే శివసేనకు చెప్పారు. ఈ విషయమై శివసేన పనుల్లో నిమగ్నమైపోయింది. 

అందుతున్న సమాచారం మేరకు శివసేన ఈ పనిని సామ్నా పత్రిక ఎడిటర్, శివసేన ఎంపీ, పార్టీ ట్రబుల్ షూటర్ సంజయ్ రౌత్ కు అప్పజెప్పినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం హాస్పిటల్ లో కోలుకుంటున్నారు. నిన్న ఆయన ఏదో రాస్తున్నట్టున్న ఫోటో ను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. శరద్ పవార్ వెళ్లి రౌత్ ను కలిసిన తెల్లారి సంజయ్ రౌత్ ఇలా రాస్తున్న ఫోటోను పెట్టడం ఇందుకు నిదర్శనం. 

Also read: మహా మలుపు: కిస్సా కుర్సీ కా నై, బీజేపీతో శివసేన వైరం వెనక ఇదే...

శివసేన ఎన్సీపీల మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు చాలా లోతుగా జరుగుతున్నాయని చెప్పడానికి అనేక కారణాలు మనకు నకనపడుతున్నాయి. నిన్న శివసేన కోర్టుకు పోతుందని ప్రకటించింది ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్. ఇలా కోర్టు మెట్లెక్కమని సలహా ఇచ్చింది కూడా శరద్ పవారే. 

కేవలం ఇరు పార్టీల అధినేతలు చర్చలు జరిపి ముందుకు వెళ్ళడం భావ్యం కాదని, వెళ్లి తమ పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పి ఒప్పించాలని సూచన చేసారు. శరద్ పవార్ సూచనకు అనుగుణంగానే నిన్న ప్రెస్ మీట్ కి ముందు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, బాంద్రాలో వారి ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్ కు వెళ్లి వారిని కలిసి పూర్తిస్థాయిలో చర్చలు జరిపి వచ్చారు. ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టారు ఉద్ధవ్. 

ఇరు పార్టీల ప్రెస్ మీట్ లను చూసినా పదాలు వేరైనా భావం మాత్రం ఒక్కటే. కలిసి చర్చించుకొని ముందుకు పోతాము. ఇక ముఖ్యమంత్రి పదవి విషయానికి వచ్చే సరకు శివసేనకు పూర్తి 5 ఏండ్ల పాటు శరద్ పవార్ ముఖ్యంన్త్రి పీఠాన్ని ఖచ్చితంగా కట్టబెట్టరు.రొటేషన్ పద్దతిలో తమకు కూడా అవకాశం ఇవ్వవలిసిందే అని ఖరాఖండిగా చెప్పనున్నారు.  ఇలా శరద్ పవార్ ఇరు పార్టీలకు మధ్య వారధిగా మారారు. ఒకరకంగా ప్రస్తుత పరిస్థితుల్లో మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారని చెప్పవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios