తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలని.. ఈ ప్రేమ , అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి వుంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు.