Asianet News TeluguAsianet News Telugu

దేవుడి హుండీలో.. అశ్లీల చీటీలు, కండోమ్స్ వేసి..

ఓ ఆలయంలో మాత్రం కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డాడు. హుండీలో అశ్లీల చీటీలు రాసి.. కండోమ్స్ వేసి చెత్తగా ప్రవర్తించారు. 

Karntaka fearing god curse, raheem and taufiq confess of urinating, putting condom in temple hundi
Author
Hyderabad, First Published Apr 2, 2021, 8:45 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేవుడి హుండీలో ఎవరైనా డబ్బులు, నగలు వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. కానీ.. ఓ ఆలయంలో మాత్రం కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డాడు. హుండీలో అశ్లీల చీటీలు రాసి.. కండోమ్స్ వేసి చెత్తగా ప్రవర్తించారు. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆలయాల్లోని హుండీల్లోకి అశ్లీల సందేశాలు రాసిన చీటీలు,కండోమ్స్‌ వేసిన మంగళూరులోని జొకట్టి నివాసి అబ్దుల్‌రహీం, అబ్దుల్‌ తౌఫీక్‌ అనే నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు బుధవారం ఎమ్మెకెరె కొరగజ్జ ఆలయంలో ఉండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్‌ చేశారు. నిందితులు మూడు నెలలుగా  పాండేశ్వర, కద్రి, ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలయాల్లో ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.   

Follow Us:
Download App:
  • android
  • ios