Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. ఇద్ద‌రు మైనర్ కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. అరెస్టు చేసిన పోలీసులు

పంజాబ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకొని తన ఇద్దరు మైనర్ కూతుర్లపైనే లైంగిక దాడికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

Horrible.. Father raped two minor daughters.. Police arrested
Author
First Published Sep 29, 2022, 12:24 PM IST

మహిళలపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఎదో ఒక చోట లైంగిక‌ వేధింపుల ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఆడవాళ్లు క‌నిపిస్తే చాలా మగాళ్ల‌లో ఉన్న మృగాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వావి వర‌స‌లు మ‌రిచి కామంతో కాటేస్తున్నారు. మహిళ శారీర‌క, మాన‌సిక‌ ప‌రిస్థితి కూడా ఆలోచించ‌డం లేదు. వికలాంగుల‌పై కూడా లైంగిక‌దాడుల‌కు దిగుతున్నారు. చిన్న పిల్ల‌లు, మైనర్లు అని కూడా చూడకుండా వారిపైకి అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. వావి వరసలు మర్చిపోతున్నారు. తాజాగా పంజాబ్ లో ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.

పెళ్లితో సంబంధం లేకుండా మహిళలు అబార్షన్ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

పంజాబ్ రాష్ట్రం ఖన్నా ఫేజ్ లోని ఫ్యాక్టరీ రోడ్డులో ఓ వ్య‌క్తి త‌న భార్యా పిల్ల‌ల‌తో క‌లిసి అద్దె ఇంట్లో నివ‌సిస్తున్నాడు. అయితే ఇటీవ‌ల అత‌డు త‌న 15 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌ను పొరుగున నివ‌సించే ఓ మ‌హిళ గ‌మ‌నించింది. అనంత‌రం ఆ మహిళ బాలిక ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏకాంతంగా మాట్లాడింది. దీంతో తండ్రి త‌న‌పై ప‌దే ప‌దే అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ మ‌హిళ వెళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింద‌ని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదించింది.

కేంద్ర మంత్రులు వచ్చుడు, పోవుడు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదు.. హరీష్ రావు

అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో పోలీసులు షాకింగ్ విషయం తెలుసుకున్నారు. నిందితుడు తన 10 ఏళ్ల కూతురుపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పాడు. పోలీసులు అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే వెలుగులోకి వ‌చ్చింది. ఓ తండ్రి క‌న్న కూతురుపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. కామావాంఛ‌తో కూతురుపైనే కాటేశాడు. బాధితురాలి త‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఇది బహిర్గతం అయ్యింది.  బోధ‌న్ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక త‌న త‌ల్లిదండ్రితో క‌లిసి ఇంటి వద్ద‌నే ఉంటూ కూలి ప‌నుల‌కు వెళ్తోంది. ఆమె తండ్రి రోజు వారి కూలీగా ప‌ని చేసేవాడు. కానీ గ‌త సంవ‌త్స‌రం నుంచి తాగుడికి బానిస‌య్యాడు. ఎటూ ప‌నికి వెళ్ల‌డం లేదు. బాలిక ప‌ని చేస్తేనే ఇళ్లు గ‌డుస్తోంది. ఈ క్ర‌మంలో తండ్రి సొంత కూతురుపైనే క‌న్నేశాడు. 

పాతబస్తీలో బిర్యానీ పంచాయితీ.. అర్దరాత్రి హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్..

12 ఏళ్ల చిన్నారి అని కూడా చూడ‌కుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. భార్య ప‌ని చేయ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు.  ప‌ని నుంచి ఇంటికి తిరిగి వ‌చ్చిన త‌రువాత బాధిత బాలిక త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని మొత్తం త‌ల్లికి వివ‌రించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్ర‌యించింది. పోక్సో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios