MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత మార్కెట్ ఎంత?, ఆ నిర్మాతలకు కోపం అందుకే వచ్చిందా?

సమంత మార్కెట్ ఎంత?, ఆ నిర్మాతలకు కోపం అందుకే వచ్చిందా?

 తమిళ సినిమాలు, హిందీ వెబ్ సీరిస్ లు చేయటమే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ తో హిందీలో ఆమెకు భీబత్సమైన మార్కెట్ వచ్చింది. అలాగే పుష్పలో ఐటెం సాంగ్ ఆమెను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.

3 Min read
Surya Prakash
Published : May 01 2024, 09:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సమంత ఈ మధ్య గ్యాప్ తీసుకుంది.  ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత ఆమె ఓ సినిమా కమిటైంది. తన రీ ఎంట్రీ ఏ సినిమాతో అనేది ఖరారు చేసి ప్రకటించింది. అదీ . సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది.అయితే సమంత మార్కెట్ ఎంత ఉంది..ఏ దైర్యంతో సొంత ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టింది. మిగతా ఆఫర్స్ ని ఎందుకు ప్రక్కన పెడుతోంది. ఇది మిలియన్ డాలర్ క్వచ్చిన్ గా ఇండస్ట్రీ వర్గాలకు మారింది.
 

210

సమంత  ఇటీవలే ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమాని పోస్టర్‌తోపాటు పేరు ప్రకటించారు. అందులో గన్‌ చేతపట్టిన గృహిణిగా కనిపిస్తున్నారు సమంత. ‘‘బంగారం అనిపించుకోవాలంటే ప్రతీదీ మెరిసిపోవల్సిన అవసరం లేదు’’ అనే ట్యాగ్ లైన్ తో  ఈ సినిమాని ప్రకటించారు సమంత.

310

అనారోగ్యం కారణంగా కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆమె, మళ్లీ మునుపటిలా నాజూగ్గా సిద్ధమై కెమెరా ముందుకు రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వాస్తవానికి సమంతకు ఆఫర్స్ కు లోటు లేదు. పలువురు స్టార్  హీరోల సినిమాల విషయంలో సమంత పేరు వినిపించినా, హీరోయిన్ ప్రధానమైన సినిమాతోనే ఆమె రీఎంట్రీ చేస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్ర దర్శకుడు ఎవరు? ఇతరత్రా విషయాలేమిటనేది అనే ఆసక్తి కన్నా.. ఎంత బడ్జెట్, సమంత మార్కెట్ ఎంత ..ఎందుకింత రిస్క్ చేస్తోంది అనేది ఆసక్తకరమైన విషయంగా మారింది.

410
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమచారం మేరకు... తెలుగు, హిందీ, తమిళంలో  సమంతకు పెరుగుతున్న పాపులారిటీతో, గ్లామర్ క్వీన్ గా సమంతా రూత్ ప్రభు 25 కోట్ల రూపాయలకు పైగా పెద్ద మార్కెట్‌ను సంపాదించుకుంది,.  ఇది కొంతమంది తెలుగు హీరోలతో సమానంగా ఉండటం విశేషం.

 

510

అంత మార్కెట్ సమంతకు రావటానికి గల కారణం ఆమె తనను తాను విస్తరించుకోవటమే. ఆమె తమిళ సినిమాలు, హిందీ వెబ్ సీరిస్ లు చేయటమే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ తో హిందీలో ఆమెకు భీబత్సమైన మార్కెట్ వచ్చింది. అలాగే పుష్పలో ఐటెం సాంగ్ ఆమెను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అదే సమయంలో తెలుగులో   కూడా ఆమె ఆకర్షణ చెక్కుచెదరలేదు. ఈ క్రమంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా డిజిటల్, శాటిలైట్ మరియు థియేట్రికల్‌తో సహా రూ. 25 కోట్లకు పైగా భారీ మార్కెట్‌ను సాధించింది.

610

25 కోట్లు అంటే  తెలుగులో ఒక హీరోయిన్ కి అత్యధికం, ”అని ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. సమంతకు విస్తరిస్తున్న ఫ్యాన్ బేస్ తో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించమని ఆమెను స్నేహితులు ప్రేరేపించారు. తన సొంత  సినిమాలు  చేయడానికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు, ”అన్నారాయన.
 

710

అయితే సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకోవటం కొందరు నిర్మాతలకు కోపం తెప్పించింది అంటున్నారు. వాళ్లు రిస్క్ అవసరమా అని చెప్పి చూసారట. ఇన్నాళ్లూ ఆమెకు సపోర్ట్ గా నిలిచిన వాళ్లు సైతం విరోధమైపోతున్నారట.  రెగ్యులర్ నిర్మాతలమే ఈ ప్రొడక్షన్ సమస్యల తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. హాయిగా పేమెంట్ తీసుకుని షూట్ కు వచ్చి వెళ్లిపోతే సరిపోతుంది కదా అని చెప్పి చూసారట. ఆమెకు శ్రేయాభిలాషులు అనుకున్న ఆ నిర్మాతలు సైతం ఈ విషయంలో ఆమెను సపోర్ట్ చేయటం లేదట.

810

దాంతో  ఆమె ఇటీవల ఒక తెలుగు నిర్మాత నుండి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది, అతను ఆమెకు భారీ పారితోషికం మరియు లాభాలలో వాటా ఇస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఆమె ప్రొడ్యూసర్ గా వెళ్లడానికి ఇష్టపడి నో చెప్పింది.  ఒక దశాబ్దం పాటు నటిగా ఉన్న తర్వాత చిత్రనిర్మాతగా తన కొత్త పనిని ప్రారంభించింది. తమ సినిమాల్లో హీరోయిన్ గా ఆఫర్ ఇస్తున్నా కాదనటం వాళ్లకు కోపం వస్తోందంటున్నారు. 

910

హీరోయిన్‌‌‌‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన సమంత.. మరో అడుగు ముందుకేసి నిర్మాతగా మారటం కలిసొచ్చే అంశం అంటున్నారు. ఇందులో సమంతనే లీడ్‌‌‌‌ రోల్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో చీర కట్టు, మెడలో మంగళ సూత్రాలతో హౌజ్‌‌‌‌ వైఫ్‌‌‌‌లా కనిపిస్తున్న ఆమె, చేతిలో తుపాకి పట్టుకుని సీరియస్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపిస్తోంది. ఇంటెన్స్‌‌‌‌గా ఉన్న ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ చూడగానే ఇంప్రెస్‌‌‌‌ చేసేలా ఉంది. ఏదో ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్‌‌‌‌తోనే ఈ సినిమా రానుందని, ఇదొక లేడీ ఓరియంటెడ్ మూవీ అని పోస్టర్‌‌‌‌‌‌‌‌ను బట్టి అర్థమవుతోంది. దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

1010

ఇక మయోసైటిస్‌‌‌‌ ట్రీట్మెంట్‌‌‌‌ కోసం కెరీర్‌‌‌‌‌‌‌‌లో బ్రేక్ తీసుకున్న సమంత.. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు వరుణ్ ధావన్‌‌‌‌తో కలిసి ఆమె నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌‌‌‌  త్వరలో అమెజాన్‌‌‌‌ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్‌‌‌‌కు రానుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved