MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వీరమల్లు టీజర్ డేట్,టైమ్ ఫిక్స్ :హఠాత్తు హడావిడి వెనక అసలు స్ట్రాటజీ ఏంటి?

వీరమల్లు టీజర్ డేట్,టైమ్ ఫిక్స్ :హఠాత్తు హడావిడి వెనక అసలు స్ట్రాటజీ ఏంటి?

హఠాత్తుగా హరిహర వీరమల్లు అప్డేట్ ఇచ్చారు. మే 2 అంటే ఎల్లుండి టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

3 Min read
Author : Surya Prakash
Published : May 01 2024, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

 

 


ప్రారంభమై చాలా కాలం అయ్యి తరుచుగా వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)  మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పబడుతున్న ఈ చిత్రం ఇప్పటికీ పూర్తికాకపోవటానికి రకరకాల కారణాలు చెప్తారు. పవన్ కెరీర్ లో వస్తున్న మొదటి పీరియాడిక్ డ్రామా ఇది కావటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.   భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


చాలా కాలంగా ఈ సినిమా నుండి అప్డేట్స్ కూడా లేకపోవడంతో.. సినిమా ఆగిపోయింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి కానీ, ఎప్పటికప్పుడు నిర్మాత ఏఎం రత్నం మాత్రం ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చాడు.ఎలక్షన్స్ పూర్తి అయ్యేంతవరకు ఈ సినిమా నుండి అప్డేట్స్ ఏమీ ఉండవు అనుకున్న వేల.. తాజాగా ఎవరూ ఊహించని విధంగా సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ధర్మం కోసం యుద్ధం.. అంటూ కొత్త పోస్టర్  రిలీజ్ చేస్తూ.. మే 2 ఉదయం 9 గంటలకు అప్డేట్ రానున్నట్లు తెలిపారు. అయితే.. ఈ అప్డేట్ లో ఎక్కడ టీజర్ అని మెన్షన్ చేయలేదు. కానీ, టీజరే రానుంది అని ఫిక్స్  చెప్పుకుంటున్నారు.
 

310


 అనుకోకుండా వచ్చిన అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీజర్ తో సోషల్ మీడియా మోతెక్కిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  హరి హర వీరమల్లు సినిమా టీజర్ రిలీజ్ తరువాత ఓ రేంజి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఇలా హఠాత్తుగా టీజర్ తీసుకురావాలనే ఆలోచన ఏమై ఉంటుందనే చర్చ మొదలెట్టారు.

410

మీడియాలో చెప్పుకునే దాని ప్రకారం  ఎన్నికలు పూర్తయ్యాక పవన్ ఫ్రీ అయ్యి ఓజి షూటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాతి ప్రయారిటీ ఉస్తాద్ భగత్ సింగ్ కే. వీటికి బిజినెస్ పరంగా ఏ ఇబ్బంది లేదు.  ఓటిటి ఎగ్రిమెంట్స్  కూడా ఆల్రెడీ అదిరిపోయే రేట్లుకు జరిగిపోయాయి. ఆ  నిర్మాతలు సేఫ్. ఈ క్రమంలో వీరమల్లు పరిస్దితి ఏమిటి...ఈ విషయమై దృష్టి పెట్టారట.

510

వచ్చే ఏడాది ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది. అలా చేయాలంటే ముందు పవన్ ఈ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ హడావిడిలో ఎక్కడ చూసినా పవన్ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు కనక టీజర్ రిలీజ్ చేస్తే జనసేన ప్రచారంతో పాటు  పవన్ కళ్యాణ్ దాన్ని ముందుకు తీసుకెళ్లిపోతారు. వాళ్లు దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. అప్పుడు టీజర్ కు మంచి మైలేజ్ వస్తుంది. ఆ క్రమంలోనే వకీల్ సాబ్ రీ రిలీజ్ జరుగుతోంది. ఇప్పుడు హరిహర వీరమల్లు టీజర్ కనుక వస్తే ..ఖచ్చితంగా   బిజినెస్ వర్గాల్లో చర్చ మొదలవుతుంది.  ఓటిటి వాళ్లు ముందుకు వస్తారు. అందుకే టీజర్ వదులుతున్నారని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా పవన్ మంచిస్వింగ్ లో ఉన్న ఈ టైమ్ టీజర్ కు హైప్ రావడంకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందనేది నిజం.

610
Pawan Kalyan Chiranjeevi

Pawan Kalyan Chiranjeevi


ఇక పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ .  ‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.ఇది ఒక గొప్ప బందిపోటు వీరోచిత గాథ అని డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే చెప్పారు. క్రిష్  త‌న ట్రేడ్‌మార్క్ అంశాల‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్యద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇది భార‌తీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ నేపధ్యంలో చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి. 

710


 సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ “హరి హర వీరమల్లు నెక్స్ట్ లెవెల్ మూవీ. దీనికి అద్భుతమైన కథ ఉంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు తమ కాలర్‌ను పైకి ఎగరేస్తారు. గర్వంతో వారి చేతులను తమ హృదయాలపై ఉంచవచ్చు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను” అంటూ సినిమాపై అమాంతంగా హైప్ పెంచేశారు. కాగా “హరి హర వీరమల్లు” ద్వారా పవన్‌కళ్యాణ్‌, క్రిష్‌ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

810

 
ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. అంటే.. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్నత‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు పీరియడ్ డ్రామా ఫిల్మ్ కావడంతో, వీఎఫ్ఎక్స్ ప‌నుల కోస‌మే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ప‌లు హాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన బెన్‌ లాక్ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు.

910


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి బాణీలు అందిస్తుండ‌గా, ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌ం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.   పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

1010

పాత్రకు అనుగుణంగా తన బాడీని తయారు చేసుకోవడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పవన్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చేశాడు పవర్ స్టార్.  వీరమల్లుగా  మేక్ ఓవర్ ఆకట్టుకుంటోంది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved