హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. అయితే పాతబస్తీలో అర్దరాత్రి బిర్యానీ విషయంలో చోటుచేసుకున్న ఫైట్.. చివరకు తెలంగాణ హోం మంత్రికి కాల్ చేసే వరకు వెళ్లింది. 

హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. అయితే పాతబస్తీలో అర్దరాత్రి బిర్యానీ విషయంలో చోటుచేసుకున్న ఫైట్.. చివరకు తెలంగాణ హోం మంత్రికి కాల్ చేసే వరకు వెళ్లింది. వివరాలు.. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్‌కు చేశాడు. ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచాలో చెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే అర్దరాత్రి వేళ బిర్యానీకి సంబంధించి విషయంలో ఫోన్ రావడంతో.. హోం మంత్రి మహమూద్ అలీ అసహనం వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాను రాష్ట్ర హోం మంత్రినని.. తనకు చాలా టెన్షన్లు ఉంటాయని చెప్పారు. అయితే పాతబస్తీలో అర్దరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అర్దరాత్రి వరకు బిర్యానీ విక్రయాల అనుమతి కోసం ఎంఐఎం నేతలు, వ్యాపారులు గతంలో హైదరాబాద్ సీపీని కలిశారు.