Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర మంత్రులు వచ్చుడు, పోవుడు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదు.. హరీష్ రావు

ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు.. కేంద్ర మంత్రుల మీద విరుచుకుపడ్డారు. యాత్రల పేరుతో తెలంగాణకు వచ్చుడు, పోవుడు తప్ప ఏం చేయలేదని ధ్వజమెత్తారు. 
 

minister harish rao fires on central ministers in hyderabad
Author
First Published Sep 29, 2022, 12:06 PM IST

హైదరాబాద్ : కేంద్ర మంత్రులపై తెలంగాణ ఆరోగ్యశాకమంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చుడు, పోవుడు తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకడు పాదయాత్ర, ఒకడు సైకిల్ యాత్ర, ఒకడు మోకాళ్ల యాత్ర అంటాడు.  ఎవరైనా సమస్యల గురించి మాట్లాడుతున్నారా? తాగునీళ్లు లేవని,  సాగునీరు లేదని, కరెంటు కోతలని ఎవరైనా అడుగుతున్నారా?  అలాంటి పరిస్థితులు ఉన్నాయా?’ అని ప్రశ్నించారు.

సీఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ సహా అన్ని శాఖల్లో తెలంగాణాకు వచ్చిన జాతీయ అవార్డులే మా పాలనకు గీటురాయి అని మంత్రి హరీష్ రావువు పేర్కొన్నారు. 

పాతబస్తీలో బిర్యానీ పంచాయితీ.. అర్దరాత్రి హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్..

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 13న హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ..  ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా  తెలంగాణ మారిందని కేంద్రం పార్లమెంటులో ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తాము ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చడం కోసమే నిధులను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిధులు వృథా కాలేదని..  అత్యంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల ధనం ఆదా అయిందని తెలిపారు.

ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పేరుతో కేంద్ర రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని హరీష్ రావు మండిపడ్డారు. ఏకపక్షంగా ఎఫ్ఆర్బీఎం చట్టంలో మార్పులు చేశారని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రానికి ఒక నీతి, రాష్ట్రానికి మరో నీతి ఉంటుందా? అని ప్రశ్నించారు.  కేంద్రం వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్ఆర్బిఎం నిధుల్లో రాష్ట్రాలకు మాత్రమే కోతలు విధించారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. 

తెలంగాణకు రూ.6,268  కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పిందని అన్నారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం ఆపిందని విమర్శించారు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్పిందని అన్నారు. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. సెస్సుల పేరిట కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన ఆదాయం  సమకూర్చుకుంటుంది అని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios